అసలు ఈ ప్రపంచం ఉద్భవించిన నాటి నుండి కూడా, ప్రేమకు గుర్తుగా ప్రేమని తెలియజేయడానికి రెండే రెండు ఉన్నాయి అని చెప్పవచ్చు. మొదటిది ఎరుపు రంగు, రెండవది రోజా పువ్వు. అందునా ప్రేమికుల వారం లేదా వాలెంటైన్స్ వారంలో రోజా పువ్వులను ప్రేమికులు ఎక్కువగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ప్రతి సంవత్సరం, వాలెంటైన్ వారం ఫిబ్రవరి 7వ తారీఖున మొదలవుతుంది. ఈ రోజు నుండి ప్రతి రోజు ఒక వారం పాటు, ప్రేమలోని ఒక ప్రత్యేకమైన అంశానికి అంకితం చేయడం జరిగింది. 

 

స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం... మనిషిలో ఇలా ఎన్నో ఎమోషన్స్.. వాటిని సింబాలిక్ గా తెలియజేసేందుకు వాడే సాధనమే గులాబీ.. ఏ రంగు గులాబీ.. ఎలాంటి పరిస్థితులలో ఇస్తారో తెలుసుకుందామా ఇపుడు..

Image result for rose day images

 

రోజ్ డే అనేది కేవలం ప్రేమికులు మాత్రమే జరుపుకునేది కాదనేది అందరికి తెలుసని మా అభిప్రాయం. విభిన్న రకాల రోజా పూలు, వివిధ రకాల భావాలను తెలియజేస్తాయి. స్నేహితులు కూడా రోజా పూలని ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఎందుకంటే, స్నేహమే ప్రేమలోని ఉత్తమమైన లక్షణం. పసుపు పచ్చ రోజా పువ్వు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది. అందుచేత మీ స్నేహితులకు ఈ రోజు ఈ రంగు రోజా పువ్వు ఇవ్వవచ్చు. గులాబీ రంగు రోజా పువ్వు కృతజ్ఞత భావానికి చిహ్నంగా నిలుస్తుంది. అందుచేత మీరు ప్రేమించే వ్యక్తులకు ఈ రంగు రోజా పువ్వు ఇవ్వవచ్చు.

 

ఇది వినడానికి కొద్దిగా బాధగా ఉన్నా, కాదనలేని నిజమిది. ఒక వ్యక్తి మన మధ్య లేనప్పుడే వారి అవసరం మరియు వారి గొప్పదనం మనకు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో, తెలుపు రోజా పువ్వుని వారు మరణించిన ప్రదేశంలో పెట్టి తమ సంతాపాన్ని తెలియజేయవచ్చు లేదా ఈ పవిత్రమైన రోజున, వారి ఫోటో ముందు కూడా తెలుపు రోజా పువ్వుని పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనస్సు ఎంతో శాంతపడుతుంది. తెలుపు రంగు రోజా పువ్వు పవిత్రతకు మరియు స్వచ్ఛతకు చిహ్నంగా నిలుస్తుంది.

 

Image result for rose day images

 

ఎవరైతే, ఈరోజు ఇంకాస్త ఉత్తమంగా ఉండాలని భావిస్తారో, అటువంటి వ్యక్తులు బెలూన్ లోపల రోజా పూల రేకులను పెట్టవచ్చు. ఎప్పుడైతే, మీరు మీ భాగస్వామితో ప్రేమలో మునిగితేలుతుంటారో, అటువంటి సమయంలో మీ భాగస్వామి చేత ఆ బెలూన్ ని పేలిపించండి. దీనికి తోడు, జంటలు బయటకు వెళ్లి రోజా పూలను ప్రతిబింబించే ఆహారాన్ని తినండి లేదా అలాంటి రోజా పువ్వు నేపథ్యం ఉన్నా కాండిల్ లైట్ డిన్నర్లు చేయండి... మీ సహచరి సాన్నిత్యాన్ని చూరగొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి: