వాలంటైన్స్ వీక్ నాలుగో రోజు ప్రామిస్ డే. తమ ప్రేమను జీవితాంతం నిలుకుంటామని ప్రేమికులు ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు దేన్నైనా సాధించడానికి సిద్ధపడటమే ప్రామిస్ డే ఉద్దేశం. ఈరోజున ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చుకున్న మాటలను కూడా గుర్తుచేసుకుంటారు. మీరు ప్రేమించిన వ్యక్తికి గతంలో మీరు ఇచ్చిన మాటను ఓ కార్డుపై రాసి.. దాన్ని మీరు సాధించగలిగారనే విషయాన్ని దానిలో తెలియజేస్తే మీ ప్రేమ మరింత పటిష్టం అవుతుంది. కావాలంటే డిజైనర్ కార్డ్స్ కూడా బహుమతిగా ఇచ్చుకోవచ్చు.
‘భారత దేశం నా మాతృభూమి..భారతీయులందరూ నా సహోదరులు’ అని స్కూల్లో పిల్లలు ప్రతిజ్ఞ సమయంలో చెబుతూ ఉంటారు. అక్కడినుండే మనకు ఒట్టు వేసే పధ్ధతి అనాదిగా అలవాటైంది అని చెప్పవచ్చు. అలాగే ప్రేమికుడు తనకు అలవాటైపోయిన దురలవాట్లకు ఈ సందర్భంగా.. 'నేను సిగరెట్ కాల్చను..మద్యం సేవించను..చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను’ అని ప్రామిస్ చేసి సదరు ప్రేయసి మనసు చూరగొంటాడు.
ఇదే మాటను మనం బైబిల్ లో కూడా చూడవచ్చును... దేవుడు కూడా మనకు ఓట్లు వేసే పద్దతి గురించి వివరించారు. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.” —మత్త. 5:37.. దీన్ని గమనించినట్లయితే... ‘మీ మాట అవునంటే అవునని ఉండవలెను’ అని యేసు చెప్పిన మాటకు దేవుని కుమారులు లోబడతారు. అదేవిధంగా మనం పురాణాల్లో కూడా చూడవచ్చును. సో ఈ పద్ధతిని మనం ఆదినుండి పరంపరగా చూడవచ్చును. కానీ కొన్ని ప్రామిస్ లను పట్టించుకోకూడదు సుమా.. ముఖ్యంగా మన రాజకీయ నాయకులు చెప్పే మాటలు.. ఇచ్చే హామీల విషయంలో బహు పరాక్.. జర జాగ్రత్త!
కనుక.. ప్రపంచ ప్రేమికులారా... ప్రామిస్ లు చేయడంలో ఏమాత్రం మొహమాట పడకండి... ఒకవేళ మీ దృష్టిలో.. మీ సహచరి, కాస్త ఇబ్బందిగా ఉంటే.. వెంటనే తడుముకొని... మీపట్ల విధేయతని వారు కలిగివుండేలా నడుచుకొని ... ఈ రోజున వారికి హృదయపూర్వకంగా... ప్రామిస్ చేసి, మరలా మీ జీవిత పయనాన్ని ప్రశాంతంగా కొనసాగించండి.. అంటే గాని, చిన్న దానికి, పెద్ద దానికి.. అయినదానికీ.. కానిదానికీ లేనిపోని అపోహలు పెట్టుకుని హైరానా పడవద్దు.