జీవితంలో విజయం సాధించాలంటే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించటం కొరకు నిరంతరం కృషి చేయాలి. శ్రమ పడకుండా విజయాన్ని సాధించలేమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కలలు కనటమే కాకుండా ఆ కలలను సాధించడానికి సరిపోయే కృషి చేయాలి. మన కలల గురించి, కోరికల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా సరైన ప్రణాళిక వేసుకొని కష్టపడితే విజయం సొంతమవుతుంది. 
 
అదృష్టం వరిస్తే విజయం సొంతమవుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అదృష్టంతో విజయం సొంతం అవుతుందో లేదో చెప్పలేము కానీ శ్రమ, పట్టుదలతో కష్టపడితే మాత్రం అనుకున్న పనిలో విజయం సాధించడం కష్టమేమీ కాదు. జీవితంలో ఎల్లప్పుడూ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లక్ష్యం కోసం శ్రమిస్తే ఫలితం వెతుక్కుంటూ వస్తుందని గుర్తుంచుకోవాలి. 
 
శ్రమ లేని లక్ష్యం గాలిలో పెట్టిన దీపమే అని అర్థం చేసుకోవాలి. లక్ష్య సాధన కోసం సంతోషాలు, సరదాలను త్యాగం చేసుకుంటూ ముందడుగులు వేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సులభంగా సొంతం చేసుకోవచ్చు. కష్టపడకుండా ఏదీ రాదని కష్టపడితే మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోవాలి. శ్రమను నమ్ముకుంటే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: