ఇల్లు కొనడం, కట్టుకోవడం ఎప్పుడైనా తెలివైన పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే అన్ని రుణాల్లోకి గృహరుణానికి వడ్డీ తక్కువ. ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు ఇస్తుంది. దీనికి తోడు ఇల్లు విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే చాలా మంది సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలనుకుంటారు.

 

ఇంటి ఆలోచన రాగానే మీ ఆర్ధిక వ‌న‌రుల‌ను, ప‌రిమితుల‌ను లెక్కేసుకోవాలి. మీ దగ్గర ఎంత నెట్ ఎమౌంట్ ఉంది. ఎంత లోనుకు వెళ్లాలి అనేది పక్కాగా లెక్క ఉండాలి. లోన్‌ కు వెళ్లాల్సివస్తే.. లోన్ పిరియడ్, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ .. వీటి గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి.

 

ఇల్లు కట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకోవాలి. భవన ప్రణాళిక , విద్యుత్, నీరు, మురుగు నీరు వంటి వాటి కోసం వివిధ ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందాలి. లేకపోతే తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇక ఇంటి నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడుతారు. అవేంటో చూద్దాం.. స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం కంటే.. అనుభవజ్ఞుడైన బిల్డర్ కు ఆ పని అప్పగించడం మేలు.

 

అయితే ఆయన ఎలాంటి వాడు గత చరిత్ర పరిశీలించి బిల్డర్ ను నియమించుకోవాల్స ఉంటుంది. అయితే బిల్డర్ ను పెట్టుకున్నా.. నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకు, ప‌నిముట్లు విష‌యంలో మీరు ద‌గ్గరుండి ప‌ర్యవేక్షించుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: