చాలా మంది విద్యార్థులు గణితం ఎంతో కష్టమని, ఎంత సాధన చేసినా బుర్రకెక్కటం లేదని చెబుతూ ఉంటారు. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వస్తున్నా గణితంలో మాత్రం తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటించటం ద్వారా గణితంలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. గణితం ఎల్లప్పుడూ నిరంతర సాధనతో మాత్రమే సులభమవుతుంది. 
 
గణితంలోని కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. మనస్సు పెట్టి నేర్చుకుంటే ఇతర సబ్జెక్టులతో పోలిస్తే గణితం ఎంతో సులభం. జీవితంలో మనం వేసే ప్రతి అడుగు గణితంతోనే ముడి పడి ఉందని సత్యాన్ని గ్రహించి కష్టపడితే గణితం పట్ల విముఖత, భయం మాయమైపోతాయి. గణితం సులభంగా నేర్చుకోవాలంటే రోజూ గణితం ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసే విధంగా టైమ్ టైబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. 
 
గణితంలో ఏ అంశం కష్టంగా అనిపించినా స్నేహితులతో లేదా ఉపాధ్యాయులతో చర్చించి గణిత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. లెక్కలతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే గణితం ఎంత సులభమో అర్థమవుతుంది. గణితం సాధన చేయటానికి వీలైనంత వరకు పెన్నూ పేపర్ ఉపయోగించకుoడా నోటి లెక్కల ద్వారా సమస్యలకు జవాబులను కనిపెట్టాలి.ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మొదట్లో కొంత కష్టంగా అనిపించినా రానురాను సులభమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: