ఆనందంగా ఉండటం ఎలా.. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మన మైండ్ సెట్ మార్చుకోవడం.. చాలా మంది గతించిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చేయడం అంటే.. వర్తమానాన్ని కూడా గతంలో నింపేయడమే. అందువల్ల మనం వర్తమానం కూడా కోల్పోతుంటాం.
గతం గతహ అంటారు అందుకే.. అయితే గతాన్ని పూర్తిగా మర్చిపోనవసరం లేదు. అలాగని పూర్తిగా గతంలోనే జీవించాల్సిన అవసరమూ లేదు. అది ప్రమాదకరం కూడా. తాజాదనానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధముంది. ఈ తాజాదనం కేవలం మనం తినే ఆహార పదార్థాలకే కాదు. మన ఆలోచనలకూ వర్తిస్తుంది.
వృద్ధులతో పోలిస్తే చిన్న పిల్లల్లో ఆరోగ్యం పాలు ఎక్కువ. అందుకే లేత ప్రాయంలో ముఖవర్చస్సు వెలిగిపోతూంటుంది. నిండు ఆరోగ్యంతో ఉన్న కొంతమంది వయోజనుల్లోనూ అంతే. ఇలాంటివాళ్లు నిరంతరం ఆనందంతో, ఉత్సాహంగా జీవిస్తుంటారు. ఈ తీరు బతుకు గమనంలో జీవితం తాలూకు తాజాదనాన్ని తేటతెల్లం చేస్తుంది.