చాలా మంది ఇంగ్లీష్ పేరు వినగానే భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ భాషలో అనర్గళంగా మాట్లాడాలంటే ప్రధానంగా భాషను అర్థం చేసుకోవడంతో పాటు తరచుగా మాట్లాడుతూ ఉండాలి. చాలామంది ఇంగ్లీష్ లో తప్పు అయినా కరెక్ట్ అయినా మాట్లాడమని చెబుతూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ అలా నేర్చుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ భాషను కరెక్ట్ గా నేర్చుకుని... కరెక్ట్ గానే మాట్లాడటం ఉత్తమం.
ఇంగ్లీష్ ధారాళంగా తప్పులు లేకుండా మాట్లాడాలంటే మొదట మనకు ఇంగ్లీష్ పదాలు బాగా రావాలి. ఎన్ని పదాలు నేర్చుకోగలిగితే అంత సులభంగా రాయవచ్చు. ఆ తరువాత పదాలను క్రమపద్ధతిలో వాక్యాల రూపంలోకి మార్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇంగ్లీష్ సులభంగా మాట్లాడటం లేదా రాయడం సాధ్యమవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకునేవారు ప్రతిరోజు తెలుగులో మాట్లాడే మాటలను పేపర్ పై రాసుకోవాలి.
అలా రాసిన పదాలను ఇంగ్లీష్ లోకి మార్చాలి. ఇంగ్లీష్ లో ప్రధానంగా సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ టెన్సెస్ నేర్చుకుంటే ఇంగ్లీష్ సులువుగా మాట్లాడవచ్చు. మనం ప్రతిరోజు ఉపయోగించే పదాలను ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడటం కష్టమేమీ కాదు. ఇంగ్లీష్ అంటే కష్టమని, సులభంగా నేర్చుకోలేమని భావించేవారు భయం వీడితే విజయం సొంతం చేసుకోవచ్చు.