సాధారణంగా చాలా మందిలో తమ దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే ఈర్ష్య, అసూయ లాంటి భావాలు వారిని చుట్టుముట్టేస్తాయి. ఒక పని చేయడంలో ఎవరైనా మన కంటే ఎక్కువ విజయవంతంగా కనిపించినా, ఎక్కువ ప్రశంస పొందినా ఈర్ష్య, అసూయ లాంటి భావాలకు లోనవుతారు. జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు ఎట్టి పరిస్థితులలోను లోను కాకూడదు.
జీవితంలో ఏ సమయంలోను అమితమైన ఆశను కలిగి ఉండకూడదు. ఉన్నంతలో పేదలకు సహాయం చేసేలా దయా గుణం కలిగి ఉంటే ఏ వ్యక్తిని అయినా ఆ లక్షణమే ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈర్ష్య, అసూయ లాంటి భావాలు నెగిటివ్ ఆలోచనలకు, దుఃఖానికి, బాధకు కారణమవుతాయి. మనకు నిజమైన శత్రువులు ఈర్ష్య, ద్వేషం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ లాంటి భావాలు స్నేహాలను కూడా దెబ్బ తీస్తున్నాయి. ఈర్ష్య, అసూయ నిరంతరం మనసును మెలిపెడతాయి. జీవితంలో ఎల్లప్పుడూ ఎవరి అవకాశాలు వారివి. ఒకరి అవకాశాలు మరొకరికి రావు. మనం ఎల్లప్పుడూ ఎంత సంతృప్తిగా జీవిస్తున్నామనే విషయాన్ని ఆలోచించాలి. జీవితమంటేనే సంతృప్తి, ఆనందం అని గుర్తుంచుకోవాలి. జీవితాన్ని ప్రతి క్షణం జీవించాల్సిన ఒక ప్రయాణంగా భావించాలి. ఈ విధంగా ఆలోచిస్తే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.