జీవితంలో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత తప్పనిసరి. ఏ రంగంలోనైనా సంపూర్ణంగా రాణించాలంటే ఏకాగ్రతే ప్రధానం. ఏకాగ్రతతో పని చేస్తే నూటికి నూరు శాతం ఫలితాలు సొంతమవుతాయి. ఏకాగ్రతతో పని చేస్తే తప్పనిసరిగా విజయం సొంతమవుతుంది. ఆశించిన పని పూర్తి చేయకపోతే మనస్సుపై ఒత్తిడి పెరిగి మనిషిని అసంతృప్తి ఆవహిస్తుంది.
ఏకాగ్రతను సాధిస్తే వర్తమానంపై దృష్టి ఉంటుంది. ఏకాగ్రత సాధిస్తే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు జీవితం ఆనందమయంగా ఉంటుంది. మన మనసుపై అదుపు సాధిస్తే జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించవచ్చు. జీవితంలో చాలా మంది తమకు మాత్రమే సమస్యలు ఉన్నాయని, మిగిలిన వారందరూ సుఖంగా ఉన్నారని భావిస్తూ ఉంటారు. జీవితంలో విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.
విజయం సాధించాలంటే మొదట మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇతరులు మన భవిష్యత్ కోసం సలహాలు ఇస్తే తప్పనిసరిగా వినాలి. వారి సలహాలలోని మంచిని గ్రహించాలి. చేసే ప్రతి పనిపై ఏకాగ్రత ఉంచితే ఆలస్యంగానైనా తప్పనిసరిగా విజయం సొంతమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రతతో కష్టపడితే లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.