జీవితం అన్నాక కష్టసుఖాలు రెండూ ఉంటాయి. అన్నింటినీ సమంగా చూడగలగాలి.. ఆ చెప్పడానికి చాలా చెప్పొచ్చు. అనుభవించే వాడికి తెలుస్తుంది అంటారా.. అంతే మరి.. కానీ ఇలా కష్టాలు అనుభవించింది మీరొక్కరేనా.. ఈ భూమి మీద కష్టం లేనిదెవ్వడికి చెప్పండి..

 

 

ఉదాహరణగా చెప్పాలంటే.. అంతటి శ్రీకృష్ణుడికి కూడా సంసార బాధలు తప్పలేదు.శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, చక్కటి గుణపాఠాలనూ నేర్పుకొచ్చాడు. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.

 

 

చెల్లెలు సుభద్ర వివాహ విషయంలో బలరామునిచే నానా మాటలూ పడ్డాడు. నరకాసురినితో ఘోరయుద్ధం చేసి, అతణ్ణి వధించాడు.పౌండ్రకుణ్ణి అంతమొందించాడు. శిశుపాలుణ్ణి కడతేర్చాడు. ద్వారకపైడికి వచ్చిన సాళ్వుణ్ణి వధించాడు శ్రీకృష్ణుడు. తన కుమారుడైన సాంబుని వివాహవిషయంలో కౌరవులతో వైరం తప్పలేదు కృష్ణుడికి.

 

 

అందుకే ఎంతటి వాడికైనా ఎదురు దెబ్బలు తప్పవు. పోరాడుతూ పోవడమే జీవితం. అందులో గెలుపు ఉంటాయి. ఓటములు ఉంటాయి. ప్రతి ఓటమి కూడా మరో గెలుపుకు నాంది అనుకుంటూనే ముందుకు సాగాలి సుమా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: