లాక్ డౌన్ విధించిన తర్వాత ఇంటికే పరిమితమైన చాలామంది స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్ బాగా వాడుతున్నారు. ఇంటి నుండి వర్క్ చేసే వారు కూడా బాగా ఎక్కువైపోయారు. ఐతే ఆఫీస్ లలో లాగా కాకుండా లేజి గా కూర్చొని, పడుకొని సుదీర్ఘ సమయంపాటు ల్యాప్‌టాప్స్ ముందు తలలు వంచి పనిచేయడం వలన వారి భుజాలలో, వెన్నులో, మెడ కండరాలలో నొప్పి పుడుతుంది. అలాగే గంటల పాటు టైపు చేయడం వలన చేతి వేళ్ళు మొద్దుబారి పోవడం, ముఖ్యంగా బోటని వేలు పై తీవ్ర ఒత్తిడి పడటం లాంటివి చెడు భంగిమ(bad posture) కారణంగా పుట్టుకొస్తాయి. ఇప్పటికే చాలా మంది ప్రజలు మెడ నొప్పి సమస్యలతో డాక్టర్ల వద్దకు తరలి వస్తున్నారు. 


ఐతే ఒక ప్రముఖ డాక్టర్ మాట్లాడుతూ... సుదీర్ఘ సమయం పాటు చెడు భంగిమలో కూర్చున్న వారికి మెడ నొప్పి రావడం సహజం. వెన్నుముకలో, భుజాలలో, మెడలో నొప్పి వస్తే అది కచ్చితంగా చెడు భంగిమలో కూర్చోవడం వల్లనే వచ్చిందని భావించాలి. ఒకవేళ మీరు ఈ సమస్యను తేలికగా తీసుకుంటే మీ చేతులకు కూడా నొప్పి సంక్రమించే ప్రమాదముంది. మీ చేతులు గానీ పాదాలు గానీ తరుచుగా మొద్దుబారిపోతుంటే ఓ వైద్యుడిని వీలైనంత త్వరలో కలవండి. అవసరమైతే ఫిజియోథెరపీ చేయించుకోండి. డాక్టర్ చెప్పిన మెడిసిన్ మాత్రమే వాడండి', అని చెప్పాడు. 


తిండి నిద్ర లేకుండా ఎక్కువ సేపు ల్యాప్‌టాప్, కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేస్తే అలసట రావడంతో పాటు జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు తలలెత్తుతాయి. ఒకవేళ మీకు అకారణంగా మెడ నొప్పి వస్తుంటే... దానికి సీరియస్ అనారోగ్య సమస్య కారణమవ్వొచ్చు. అందుకే మెడనొప్పి ని తేలికగా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. మెడనొప్పి కారణంగా తలనొప్పి, వాంతులు అవ్వడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇలాంటివి తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: