ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ ఎన్నో సమస్యలుంటాయి. అసలు సమస్యలు లేని ఇల్లే ఉండదు. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొంటామన్నదే అసలు సమస్య. సమస్యలను సామరస్యంగా ఎంతవరకూ పరిష్కరించుకుంటామన్న దానిపై మన ఇంటి పరువు ఆధారపడి ఉంటుంది. దానినే ఇంటిగుట్టు’ అని పిలుస్తారు.
కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం ఉండాలి. అలా నిర్మాణం చేయాలి. అప్పు డప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. అయినా సరే, వాటిలో రహస్యాలను ఇతరులకు అంటే మూడో వ్యక్తికి వారు ఎంత పెద్ద వారైనా సరే బహిరంగం చేయాలనుకోవడం తెలివి తక్కువ పని.
దాని వల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరట. ఆ ప్రేమ బంధం ఆ ఇద్దరు సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి.
ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అందుకే మన పెద్దలు అనేవారు . ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు అని అన్నారు.
మనుషులు భార్య భర్త మధ్య జరిగిన కలయిక సంగమము గురించి ఒక్క కన్న తల్లి తప్ప మరో ఏ ఇతర వ్యక్తులకు ఆ అందమైన అనుభవం గురించి చెప్పకూడదట. ఆ రహస్యమైన భగవంతుని దీవెనలు ఆశీస్సులతో రెండు మనసులు కలిసి ఎంతో పవిత్రమైన కార్యం జరుపుతారట . అటువంటి కార్యాన్ని ఏ ఇతర మూడో వ్యక్తి కి ప్రాణం పోయినా చెప్పకూడదట.రహస్యంగా ఉంచడం ఉత్తమం.