జీవితం ఓ ప్రయాణం.. అది సాఫీగా సాగిపోవాలంటే.. మమతల కోవెలగా విరాజిల్లాలంటే కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. అప్పుడే జీవితంలో మమత మాధుర్యాలు మనకు అందుతాయి. జీవితంలో భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు ఎవరైనా విలువ ఇస్తారు. అదే తమ కుటుంబం అనుకుంటారు. కానీ.. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వారు ఊపిరి ఆగిపోయినంత వరకు కలిసి ఉండాలన్న స్ఫూర్తిని మరిచిపోతున్నారు.

 

 

ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా చేసుకొని పగలు ప్రతీకారాలు పెంచుకుని మాటలు లేకుండా దూరంగా ఉంటున్నారు. నాకు దక్కక పోయినా పర్వాలేదు వాడికి దక్కకూడదు అనే ఒక రకమైన ఈర్ష్య అసూయలు బంధాలను నాశనం చేస్తున్నాయి. పోయేటప్పుడు ఆస్తి, డబ్బు మనతో రాదని తెలిసి కూడా వాటి కోసమే ఇంకా ప్రాకులాడటం మూర్ఖత్వమే.

 

 

ఒక్కసారి బాల్యం గుర్తు చేసుకోండి. అభం శుభం తెలియని పసి వయసులో తోబుట్టువులపై ఉన్న ప్రేమ ఆప్యాయత.... వయసు, అనుభవం, జ్ఞానం వచ్చాక కనుమరుగై పోతోంది. ఈ జన్మలో అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా పుట్టినవాళ్ళు మరుజన్మలో ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికీ తెలియదు.

 

 

ఒక తల్లి కడుపులో, ఒక ఇంటిలో, ఒక కంచంలో జీవితం మొదలుపెట్టిన తోబుట్టువులు అవసాన దశలో పాడే కట్టేనాటికి పక్కన లేకపోవటం అత్యంత బాధాకరం. అందుకే దయచేసి రక్త సంబంధాలుకు విలువ ఇవ్వండి. ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు అనురాగంతో ఆత్మీయతతో మెలగండి. మీ తోబుట్టువుల ఆత్మీయతానురాగాలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల బంధాలే... మీ పిల్లలకు ఆదర్శం కావాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: