భార్య భర్తలు మధ్య శృంగారం అనేది ఒక ముఖ్య ఘట్టం.. పెళ్ళైన మొదట్లో సరసాలు, సరదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.కొద్దీ రోజులు మోజు తీరే వరకు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఆ తర్వాత కొంతమందికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా భార్యభర్తలు కలిసి ఆనందంగా ఉన్నట్టు అనిపించదు. ఇద్దరికీ ఒకరికి ఒకరు ఇష్టమో తెలియదు..ఇలాంటి మీరు అవస్థ పడుతున్నారా? ఇద్దరి మధ్యా సరైన కమ్యూనికేషన్ లేకపోతే వచ్చే ప్రాబ్లం ఇది.
అలాగని ఎవ్వరూ నోరు తెరిచి చెప్పుకోరు. ఆటోమేటిగ్గా అవతలి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. చెబితే బావుండదేమో అని అనుకుంటారు. కానీ, ఈ టిప్స్ పాటించండి.అయితే వీరిద్దరి బంధం హ్యాపీగా ఉండాలంటే వారిద్దరి మధ్య మాటలు పెరగాలి అప్పుడే సంతోషంగా ఉంటారు. నమ్మడం వేరు, తెలియడం వేరు. పైగా ఈ కన్వర్జేషన్స్ లో కమ్యూనికేషన్ మాత్రమే కాదు, లవ్ ఎండ్ అఫెక్షన్ కూడా ఉంటాయి.
మీరు ఆవిడతో నిజాయితీ గా ఉండాలనీ, ఆవిడని నమ్మాలని ఎక్స్పెక్ట్ చెయ్యడం లో తప్పు లేదు కదా. మీ కలలూ, మీ కోరికలూ మీకున్నప్పటికీ, మీ ఇద్దరి బాంధవ్యం కంటే అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మీరే జాగ్రత్తపడాలి. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ప్రామిస్ బ్రేక్ చెయ్యడం లాంటివాటికి అసలు స్థానం లేదు. ఇంకా అపార్ధాలు ఉంటే మీరిద్దరూ కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది.అంతేకాకుండా అమ్మాయితో శృంగారం చేయాలంటే అన్నీ అర్థం చేసుకోవాలని అంటున్నారు.. మీ భార్యకి వంటలో సాయం, గిన్నెలు కడగడంలో సాయం కూడా చేయొచ్చు. లేదా ఒక పూట వంట పూర్తిగా మీరే చెయ్యచ్చు, ఆవిడ ఆనందానికి అంతే ఉండదు. ఆవిడకి ఉండే వంద పనుల్లో మీరు చేసే చిన్న హెల్ప్ కూడా ఆవిడకి ఎంతో రిలీఫ్ ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి.