మీ జీవిత భాగస్వామి ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా ఆలోచించారా.. మీ భార్య, మీ కొడుకు, మీ కూతురు, మీ తండ్రి, మీ తల్లి.. మీ సమాధానాల్లో వీరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటారు. వారిలో ఎవరో ఒకరు మీ జీవిత భాగస్వామి అనుకుంటారు. 

 

IHG


కానీ అసలు విషయం ఏంటో తెలుసా.. మీ అసలైన జీవిత భాగస్వామి.. మీ దేహం.. అవును.. ఇది పచ్చి నిజం.. ఒక్కసారి ఈ దిశగా ఆలోచించండి.. మీ దేహంలో ప్రాణం అంటూ లేకపోతే అసలు మీరు లేనట్టే.. మీ దేహం ఒక్కసారి స్పందించకపోతే.. ఇక పైన చెప్పిన వారు ఎవరూ దాన్ని పట్టించుకోరు.

 

IHG


మీరు ఈ భూమి మీద అడుగుపెట్టినప్పటి నుంచి.. తొలి శ్వాస తీసుకున్నప్పటి నుంచి.. తుది శ్వాస వరకూ మీరు కలసి ఉండాల్సింది మీ దేహంతోనే.. ఇది నిజమే కదా.. అందుకే మీరు మీ దేహం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాల్సిఉంటుంది. భార్యా, పిల్లల కోసం జీవితమంతా చాలా మంది  పరుగు తీస్తూ తమ దేహాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. 

 

ఇది ఏమాత్రం సరి కాదు.. మీరు ఏం తింటున్నారు.. ఏం చేస్తున్నారు.. గుర్తుంచుకోండి.. మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకూ మీ శాశ్వత చిరునామా మీ దేహం మాత్రమే. మీ దేహం మీ ఆస్తి.. అది ఎవరితోనూ పంచుకోలేని.. పంచుకోనవసరం లేని ఏకైక ఆస్తి.. కాదంటారా.. అందుకే మీ దేహం గురించి కాస్త శ్రద్ధ తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: