ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి కొన్ని జీవిత సత్యాలను కూడా ప్రపంచానికి చెబుతోంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. ప్రకృతిని దాటి పోలేడన్న వాస్తవాన్ని మరోసారి కళ్లకు కడుతోంది. అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయే మనిషి.. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి చేతిలో చావు దెబ్బ తింటున్న వైనం.. మనిషికి ఉన్న పరిమితులేమిటో చెప్పకనే చెబుతోంది. 

 

IHG


మనిషి.. దేవుని రూపంలో ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క రూపం.. సొంత బుర్రతో ఆలోచించగలిగిన అవకాశం ఉన్న ఒకే ఒక్క జీవి. బుద్దిబలంతో ప్రపంచ జీవజాలాన్నే శాశించ గలిగిన జీవి. అలాంటి వాడు .. ఒక సూక్ష్మ జీవి చేతిలో ఇప్పుడు తలకిందులవుతున్నాడు. తంటాలు పడుతున్నాడు. మనిషి అహంకారాన్ని దెబ్బతీసే పరిణామం ఇది. 

 

IHG

 

ఎన్ని కనిపెట్టినా.. ఎంత మేథస్సు ఉన్నా.. మనిషి కూడా ఈ భూమిమీద మిగిలిన జంతువుల్లా ఓ జంతువేనని చెప్పకనే చెబుతోంది ఈ కరోనా వైరస్. భూమి మీద ఉన్న అన్ని జీవరాశులనూ తన సహచరులుగా అంగీకరించి.. అందరి క్షేమం కోరుతూ.. అన్నింటి బాగునూ పట్టించుకుంటూ ముందుకు సాగితేనే మనిషికి మనుగడ అన్న విషయాన్ని మరోసారి చాటి చెబుతోంది ఈ కరోనా వైరస్. 

 

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: