తనకు ఉన్నదాన్ని గుర్తించకపోవడం.. పొరుగువాడికి ఉన్నదాన్ని చూసి అసూయపడటం మానవ నైజం.. భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఇస్తారు. అది మిగిలిన వారికిలా ఉండకపోవచ్చు.. దాన్ని గుర్తించగలగాలి.. తన ప్రతిభను తానే గుర్తించి మెరుగు పెట్టుకున్న మనిషికి విజయం చాలా సులభం. 

 

IHG


ఉదాహరణకు ఒక పుట్ బాల్ ఆటగాడికి కాళ్ళు బలం.. అందుకే వాటికి ఏం కాకుండా చూసుకోవాలి.  ఒక పాటగాడికి  గొంతు బలం.. ఒక ఉద్యోగికి ఉద్యోగమే బలం.. ఒక పండితునికి జ్ఞానం బలం.. ఒక తండ్రికి పిల్లలు బలం.. ఒక రాజకీయనాయకునికి పదవి బలం.. అందగత్తెకు అందం బలం.. 

 

IHG


దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు బలాలే బలహీనతలుగానూ మారుతుంటాయి..  ఒక పహిల్వాన్ కు కండలు బలం... ఒక్కోసారి అవే బలహీనత అవుతాయి. ఒక సెలబ్రెటీకి  పేరు ప్రఖ్యాతులు బలం... కానీ వాటి కారణంగా సదరు సెలబ్రెటీ కొన్ని పనులు చేయలేకపోతాడు. అది ఒక బలహీనత. 

 

IHG


ఒక ధనవంతునికి ధనం బలం.. దాని కోసం ఏదైనా చేయగలగడం అతని బలహీనత అవుతుంది. ఇలా మనం బలం అనుకున్నవే  కొన్నిసార్లు మన బలహీనతలు అవుతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి.. అదేంటంటే.. మనకు ఎన్ని ఉన్నా మన ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. అందుకే మన బలాలు, బలహీనతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటే.. విజయం సులభం అవుతుంది. ఆరోగ్యాన్ని నిత్యం కాపాడుకుంటే.. జీవనం ఆనందమయం అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: