బచ్చలికూరలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులో కాల్షియం: 24.8 మిల్లి గ్రాంలు, ఇనుము: 0.67 మిల్లి గ్రా., పొటాషియం: 140 మిల్లి గ్రా, విటమిన్-సీ: 7 మిల్లి గ్రా., సోడియం: 19.8 మిల్లి గ్రాంలు ఉంటాయి. కొద్ది మోతాదులో జింక్, ఫోలెట్, విటమిన్-ఏ, విటమిన్-కే, కెరోటిన్, లుటిన్‌తోపాటు జియాక్సంతిన్ కూడా ఉన్నాయి. అందుకే వారానికి ఒకసారి అయిన ఈ ఆకుతో కూరలు చేసుకొని తినడం మేలని అంటున్నారు. ఈ ఆకు వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
కంటి పరిరక్షణ..
బచ్చలికూరలో అధికమోతాదులో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఈ మ్మేళనాలు కంటిని అతినీలలోహిత కాంతి నుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. దీర్ఘకాలిక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బీపీని తగ్గింది..
బచ్చలి కూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా లభించే రసాయన సమ్మేళనాలు. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభావవంతమైన ఆహారం ఇదే.
రక్తహీనతను తగ్గిస్తుంది..
బచ్చలికూరలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది. దీంతో ఎర్రరక్త కణాల సంఖ్య పెరిగి, రక్తహీనలోపం తగ్గుతుంది.. చిన్న పిల్లలు, గర్భిణులు, రుతుస్రావం సమయంలో మహిళలకు రక్తహీనత అధికంగా ఉంటుంది. కాబట్టి బచ్చలి కూర తీసుకుంటే ప్రయోజనముంటుంది.
ఇవే కాకుండా మెదడుకు చాలా మేలు చేస్తుందట .. మతి మరుపు పోగొట్టడం లో ఈ బచ్చలి కూర మంచి ఔషధం అని అంటున్నారు.. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటి నుంచి అయిన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..