ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐస్ టీ కి చాలా మంచి స్పందన వస్తోంది. ఐస్ టీ తాగితే డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజువారీగా తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. శరీరంలో నిల్వ ఉన్న విష వ్యర్థాలను తొలగించడంతో ఐస్ టీ ఎంతో పనిచేస్తుందన్నారు. టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడి, ఫ్రీ రాడికల్స్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. పండ్లు, కూరగాయల్లో కంటే 8 రెట్లు ఎక్కువగా టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని నిపుణులు వెల్లడించారు. 350 గ్రాముల కూల్‌డ్రింక్‌లో 39 గ్రాముల పంచదార ఉంటుంది.
9 స్పూన్ల చక్కెర తో సమానం..అదే 350 గ్రాముల ఐస్ టీలో షుగర్ ఉండదు. 2 కేలరీల శక్తే వస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ దివ్వౌషధం. దంతాలను కాపాడటంతో ముఖ్యభూమిక పోషిస్తుంది. దంతాలను పాడుచేసే కేవిటీస్‌పై పోరాడుతుంది. ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. మహిళలకు కావాల్సిన మాంగనీసులో 35 శాతం కవర్ చేస్తుంది. మగవాళ్లకైతే 23 శాతం కవర్ చేస్తుంది. మాంగనీస్ వల్ల దెబ్బలు త్వరగా నయం అవుతాయి. దీంతోపాటు ఎముకలు ధృడంగా మారుతాయి. టీ తాగేవారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఐస్ టీని తాగడం వల్ల గుండె సమస్యలు రావనీ వైద్యులు నిర్ధారించారు. ఇకమీదట ఐస్ తాగడం అలవాటు చేసుకోండి..