లోబ్ స్ట్రాస్ అనే జర్మన్ వ్యాపారవేత్త 1870 లోనే జీన్స్‌ను మొదటిసారి డిజైన్ చేశారు. అప్పటినుంచి ఇది అనేక మార్పులను చేసుకుంటూ, కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే లోబ్ స్ట్రాస్ ఈ జీన్స్ ప్యాంట్ ను మొదటగా కార్మికుల కోసం తయారు చేశారు.ఇది ఎక్కువ కాలం మన్నిక రావడంతో కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ జీన్స్ ప్యాంట్ లను డిజైన్ చేశారు. ఇకపోతే రిప్డ్ జీన్స్ 1970 మొదటిసారిగా వార్తల్లోకి వచ్చాయి. ఒక సామాజిక ఉద్యమంలో భాగంగా సమాజం పై ఉన్న అసంతృప్తి, కోపానికి గుర్తుగా కార్మికులు వారి జీన్స్ ప్యాంట్ లను కోతలు పెట్టేవారు. ఈ విధంగా అప్పట్లోనే ఈ రిప్డ్ జీన్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఈ విధంగా కార్మికులు కోత పెట్టిన విధంగా జీన్స్ ప్యాంటులను ధరించి మొదటిసారిగా ఈ రిప్డ్ జీన్స్ మడోన్నా ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఒక సందర్భంలో ఆమె రిప్డ్ జీన్స్ వేసుకొని కనిపించగా, ఈ కొత్త డిజైన్ నచ్చిన అభిమానులు ఆమెను అనుసరించడం మొదలు పెట్టారు. మొదట్లో ఈ విధమైన రిప్డ్ జీన్స్ కోసం మడోన్నా అనుచరులు జీన్స్ ప్యాంట్ కు కోతలు పెట్టేవారు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన
డెనిమ్ కంపెనీలు ఈ ట్రెండ్‌ను వ్యాపారంగా మార్చుకొని 'రిప్డ్ జీన్స్'ను పరిచయం చేశాయి. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.అయితే ఈ జీన్స్ ప్యాంట్లు కూడా ఖరీదు ఎక్కువగా ఉండడంతో కొందరు జీన్స్ ప్యాంట్ కు కోతలు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఎగతాళి చేసేవారు. ఫ్యాషన్ లోక భాగమైన ఈ రిప్డ్ జీన్స్ ను కత్తిరించడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి లేజర్ లైట్ సహాయంతో జీన్స్ కు సున్నితంగా మండిస్తూ రంధ్రాల వచ్చే విధంగా చేస్తారు. అదేవిధంగా కొందరు కార్మికులు ఈ జీన్స్ లకు కోతలు పెడతారు. ఈ విధంగా ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు ఈ రిప్డ్ జీన్స్ ధరించడం ఫ్యాషన్ గా మారిపోయింది.