మునగ ఆకుని అన్ని పోషకాలు ఉన్న పోషకాల గని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే మునగ చెట్టు ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడడంతో పాటు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుంది.అలాగే దీనిలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ బి2, ఐరన్, మెగ్నిషియం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు మునగ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నిత్యం మునగ ఆకును మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆకులను తినడం వలన శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. దీంతో ఎముకలకు బలం చేకూరుతుంది.
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నియంత్రిస్తాయి. దీంతో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా దూరమవుతాయి. అప్పుడప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున అలాంటి వాళ్లు మునగ చెట్టు వేళ్లను తీసుకుని బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకుని తాగితే ఉపశమనం లభించవచ్చు. ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది. మునగాకులు షుగర్ వ్యాధి నుండి రక్షణ కలిపిస్తాయి. ఎలాగంటే మునగ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.