ఆపిల్ తో జిలేబిలు చేసుకుంటారా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. వీటిని రెస్టారెంట్ లో మాత్రమే కాదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు.ముందుగా కాస్త ప్రిపరేషన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఆపిల్ ను ఎప్పుడు అలాగే కాకుండా కొన్ని రకాల వంటల లో వేసుకుంటారు.. ఇప్పుడు వాటితో పాయసం, అల్వా లాంటి వంటల తో పాటుగా మరికొన్ని రుచికరమైన వంటల ను కూడా చేసుకోవచ్చునని అంటున్నారు... మీ ఇంట్లో హోలీ సందర్భం గా ఆపిల్ జిలేబి ని ఈ విధంగా చేసుకుని ఇంటిల్లిపాది ఆనందంగా తినండి. ఆపిల్ జిలేబి ని పెద్దలు, పిల్లలు కూడా ఇష్టం  గా తింటారు. అయితే హోలీ స్పెషల్ ఆపిల్ జిలేబి తయారు చేసుకునే విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం..


ఈ జిలేబి కి కావలసిన పదార్ధాలు..

ఆపిల్: 1,

పంచదార : 300 గ్రాములు,

కుంకుమ: పువ్వు ఒక గ్రాము,

 నెయ్యి: 500 గ్రాములు,

పాలు: 250 మిల్లీ లీటర్లు,

పెరుగు: 100 గ్రాములు,

 మైదా : 200 గ్రాములు

తయారీ విధానం..


ఈ జిలేబి లను తయారు చేయడానికి ముందుగా మైదా పిండి లో, పెరుగు లో బాగా నాన పెట్టాలి..  తరువాత 24 గంటల వరకు అలానే వదిలేయాలి. ఇప్పుడు పంచదార తీసుకుని సిరప్ లాగ చేయండి. ఆ తర్వాత దీనిలో పాలు కూడా పోసి అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి మరిగించండి. దాని లో కట్ చేసిన యాపిల్ ముక్కల్ని పిండి లో ముంచి వేయించాలి.. వాటిని పక్కన పెట్టి షుగర్ సిరప్ లో వెయ్యండి. అంతే ఇక యాపిల్ జిలేబి రెడీ అయిపొయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది.. ఇలా వెరైటీ గా చేసుకొంటే చాలా బాగుంటుంది.. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. మీకు ఇలా నచ్చినట్లయితే మీరు ట్రై చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి: