వేసవి లో చాలా మంది మంచి ఫుడ్ ను తీసుకోవాలని, వేసవిని తట్టుకోవాలని అనుకుంటారు. అయితే ఎటువంటి రకమైన ఫుడ్ ను తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. వేసవి వేడిని తట్టుకోవడానికి రకరకాల కూరగాయలను, పండ్లను తీసుకోవడం చాలా మంచిది.. అప్పుడే బాడీలోని వేడిని తగ్గిస్తుంది. వేసవి వేడికి శరీరంలో నీరు ఆవిరైపోతుంటే, దానికి ఎప్పటికప్పుడు నీటిని అందిస్తూ ఉండాలి.

అందుకే నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారాలు మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలాంటి వాటిలో సలాడ్లు బాగా పనిచేస్తాయి. వెరైటీలతో చేసిన సలాడ్లు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ముందుంటాయి. ఆరోగ్యాన్ని అందిచే సలాడ్లు ఏంటనేది చూద్దాం..


గుమ్మడికాయ సలాడ్

గుమ్మడికాయ బరువులో 90శాతం నీరే ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ గా పనిచేయడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇంకా కన్ను, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండడంతో రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతుంది.

దోసకాయ, టమాట, అవొకోడో

అవొకొడోలో ఎక్కువశాతం మంచికొవ్వు ఉంటుంది. ఇది చెడు కొవ్వుని తొలగించడంలో సాయపడుతుంది. మెగ్నీషియం, ఫొలేట్, విటమిన్ ఈ ఉండడం వల్ల అనేక ఇతర అపాయకరమైన జబ్బుల నుండి దూరం చేస్తుంది.

టమోటా సలాడ్

టమాటల్లో విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అందానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

పుచ్చకాయ, బెర్రీ సలాడ్

పుచ్చకాయలో ఉండే నీటిశాతం వల్ల ఆరోగ్యానికి మేలు. అంతేకాదు అందులోని లైకోపీన్, సూర్యుడి నుండి చర్మాన్ని కాపాడడంలో బాగా సాయపడుతుంది. పుచ్చకాయలో పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పొద్దున పూట తినే సలాడ్ కి పుచ్చకాయ మంచిది..

ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయలను, పండ్లను ఉపయోగించి సలాడ్ ను చేసుకొని తినొచ్చు.. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను పండ్లను వాడటం మరీ మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: