పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. ఎక్కడ చేసిన కూడా వాటికున్న రుచి వేరే అని చెప్పాలి. అందుకే వాటికి డిమాండ్ కూడా ఎక్కువే అందుకే ప్రతి ఒక్కరూ తినాలని అనుకుంటారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితిలో బయట పానీపూరి అనేది ఎక్కడా కనిపించలేదు. దీన్ని చాలా మిస్ అవుతుంటారు. కొన్ని చోట్ల ప్రాంతాల్లో పానీపూరి దుకాణాలు తెరిచినా తినేందుకు ఎవ్వరూ సాహసించలేరు. ఇంట్లోనే అలాంటి రుచికరమైన పానీపూరీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ముందుగా పానీపూరీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఒక కప్పు గోధుమ పిండి, ఒక బొంబాయి రవ్వ వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని, అందులో నీళ్లు కూడా యాడ్ చేసి  పూరి పిండిలాగా చేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని చపాతీలాగా చేసుకొని చిన్న గ్లాస్ తో పానీపూరి సైజులో తీసుకోవాలి. వాటిని నూనె పెట్టి డీ ఫ్రై చేసుకోవాలి.. పూరి రెడీ..

ఇకపోతే మసాలా..

పానీపూరీ తో పాటు నంజుకోవడానికి ఉడికించిన బంగాళ దుంపలు, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయల ను తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో కలుపుకుని జీలకర్ర, ఛాట్ మసాలా,  రుచికి సరిపడా కారం, గరం మాసాలా వేసుకోవాలి. సరిపడా ఉప్పును వేసుకోండి. రుచికరమైన  పానీపూరి మసాలా రెడీ..
పానీపూరి ముఖ్యంగా కావాల్సింది .. పానీ , ఈ పానీ తయారీకి ఒకకప్పు పుదీనా కప్పు కొత్తిమీర, 2  పచ్చి మిరప కాయలు చింతపండు, జీలకర్ర పొడి, ఉప్పు, నీళ్లు.. వాటిని మిక్సీ పట్టి నీళ్లు పోసి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. అంతే అదిరిపోయే టేస్ట్ తో పానీపూరి రెడీ..

 చూసారుగా చాలా సింపుల్ గా పానీపూరి ఎలా తయారైందో.. ఇంకెందుకు ఆలస్యం పానీపూరీని ఇలా చేసుకొని ఇంటిల్లి పాది ఆస్వాదించండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: