గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.మలబద్ధకంతో ఇబ్బంది పడేవాళ్ళు ఆలూబుఖరా పండ్లు తింటే మంచిది. వీటిలో ఇసాటిన్, సార్బిటాల్ ఎక్కువగా ఉండడం వలన ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆలూ బకరా పండ్లు క్యాన్సర్ నుంచి మనల్ని రక్షిస్థాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఆలు బుఖరా పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు రక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరం.
ఆలు బుఖరా పండ్లు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఆలుబుఖరా పండ్లు ఎముక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్థాయి. ఇందులో ఉండే బోరాన్ ఎముక సాంద్రతను కాపాడటంతో పాటు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనది. ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులోని విటమిన్ కె ఎముకల పటిష్టతను కాపాడటంతో పాటు, ఆల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.అలాగే కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది.చూసారు కదా ఈ పండు యొక్క ఉపయోగాలు. మరి ఈ పండు మీకు మార్కెట్లో ఎక్కడ కనిపించిన కొనడం మాత్రం మరవకండి.