బంగారంతో సమానం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. వంటింటి దినుసులలో ఒకటైన నల్లమిరియాలు. నిజమేనండి.. ఆ కాలంలో కేజీ బంగారం తో సమానంగా, ఈ నల్ల మిరియాలను ఇచ్చేవారట. అంటే దీని అర్థం ఒక కేజీ బంగారం ఇస్తే, ఒక కేజీ నల్లమిరియాలు ఇచ్చేవారట. అయితే ఇంత విలువైన నల్లమిరియాలు మన శరీరానికి కూడా ఎన్నో రకాలుగా ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే ఈ నల్ల మిరియాల వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏమిటో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. క్యాన్సర్ నివారిణి:
సాధారణంగా క్యాన్సర్ అనేది చెప్పాపెట్టకుండా వచ్చే రోగం. ఇది వచ్చిన తర్వాత ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి క్యాన్సర్ కణాలు మన శరీరంలో పెరగకుండా ఉండాలి అంటే ఈ నల్ల  మిరియాలను ప్రతి రోజు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

2. అధిక బరువు:
చాలా మంది బరువు తగ్గాలనుకొనే వారు.. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు . ఇక ముఖ్యంగా మన శరీరంలో అత్యధికంగా కొవ్వు కణాలు ఏర్పడకుండా ఉండాలంటే, ప్రతిరోజు పొడి రూపంలో తీసుకోవడం ఉత్తమం.

3. డయాబెటిస్ నివారిణి :
మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మిరియాలను ఆహారంలో తప్పక చేర్చుకోవాలి.

4. ఫ్లూ:
ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలం వచ్చింది అంటే చాలామంది జబ్బుల బారిన పడుతుంటారు. ఇక ఇక కాలం తో పాటు వచ్చే సమస్యలు అనగా జలుబు, దగ్గు , గొంతులో గరగర అనిపించడం వంటి సమస్యలకు మంచి పరిష్కారం.

5. మలబద్దక సమస్య లు:
చాలామంది తిన్న ఆహారం సరిగా జీర్ణం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు.  ఇక అలాంటి వారికి ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే, తప్పకుండా ఈ మిరియాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి.

చూశారు కదా..!  ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే తప్పకుండా మన ఆహారంలో మిరియాల పొడి లేదా మిరియాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: