భారతదేశం మహిళలకు సాంప్రదాయ దుస్తులలో చీరకట్టు అనేది చాలా ముఖ్యం. ఇతర దేశాలలో  మన చీరకట్టును చూస్తే భారతీయులం ఈజీగా గుర్తుపట్టేస్తారు. మిగతా ఏ దేశంలో నైనా  మాడ్రన్ దుస్తులు వేసుకుంటే తప్ప , చీర కట్టుకుంటే ఎవరు కూడా అభ్యంతరం చెప్పారు. ఆ చీరకున్న గొప్పతనం అలా ఉంటుంది. చీర కడితేనే  భారతీయ మహిళకు  కళ ఉట్టిపడుతుంది. అందుకే చీర మీద కూడా అనేక పాటలు వచ్చాయి. అనేక కథలు కూడా రాశారు కవులు. చీరకట్టులోనే  అందాలు కనిపించీ కనిపించకుండా ఉంచడమే దాని గొప్పతనం. మహిళల యొక్క అందాల్ని నడుము ఒంపు సోంపు అనేది కళ్లకు కట్టేలా చేయడం  చీరలకే సాధ్యమవుతుంది. మహిళలు చీరలను చక్కగా కట్టుకుంటే దానికి మించిన అందం వేరే దుస్తుల్లో ఉండదని చెప్పవచ్చు.

  ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడుతున్నా  నేటి అమ్మాయిలు  చీర కట్టుకోవడం ఎలాగో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడో పండగలు, ఏదైనా పెద్ద ఫంక్షన్ లో తప్పితే  అసలు చీర కట్టడం అనేది వారికి తెలియదు. మనం మన కల్చర్ ను  పాడు చేసి విదేశీ  సంస్కృతికి అలవాటు పడుతున్నాం.ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిలకు  అసలు చీర ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏ విధంగా కట్టుకోవచ్చని చెప్పినా ఆ సమయంలోనే సరే అంటూ తర్వాత మర్చిపోతున్నారు. చీర కట్టుకున్నప్పుడు మాత్రమే  సెల్ఫీలు దిగే పరిస్థితికీ మన అమ్మాయిలు వచ్చారు. తర్వాత చీరలను అల్మారాలు మడిచి పెట్టాల్సిందే. చీర ఏవిధంగా కట్టుకోవాలి, ఇలా ఎలా చుట్టుకుంటే బాగుంటుంది.

కుచ్చులు ఎలా సెట్ చేసుకోవాలి. చీర పిన్ను ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనకు యూట్యూబ్ లో చాలా వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక ఛానల్ చేసిన వీడియోలను అమ్మాయిలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.  ఈ విధంగా భారతీయ మహిళకు  చీర అనేది  పూర్వపు సంప్రదాయాన్ని తీసుకొస్తుందని, చీర కట్టుకుంటే నే  మహిళకు అందం ఉంటుందని, అందుకే భారతదేశంలో పెళ్లి సమయంలో  ప్రతి మహిళకు  చీరకట్టు తప్పనిసరి ఉంటుందని, చీర కడితేనే  అందం ఉట్టి పడుతుందని , మన చీరకట్టు సాంప్రదాయాన్ని  మనం కాపాడుకోవాలని, విదేశీ దుస్తులను  వదిలేయాలని చాలామంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: