శ‌త్రువులు ఎవ్వ‌రూ లేరు

కానీ యుద్ధం ఉంది

కాలాన్ని జ‌యించే శ‌క్తి  ఉంది

బాహువుల‌కు ఉన్న శ‌క్తి అది

ఇక్క‌డి నుంచి మ‌నంద‌రి నుంచి

పొందిన శ‌క్తి అది స్ఫూర్తి అది


మ‌ళ్లీ బాహుబ‌లి వ‌చ్చాడు

మ‌ళ్లీ మ‌ళ్లీ యుద్ధాల‌ను గెలిచి వ‌

వ‌చ్చాడు

కోట్ల సైన్యం త‌న వెంటే ఉంద‌ని 

నిరూపించాడు..

ఆ కోట్ల సైన్యంలో నేనూ ఒక‌డ్ని అంటూ

ఆనంద్ మహీంద్రా మురిసిపోయాడు


ఒక్క ఆనంద్ మ‌హీంద్రా ఏమ‌న్నారో తెలుసా... ఓ బాహుబ‌లీ నీ సైన్యంలో నేనున్నాన్న‌య్యా..అని! కొత్త మోడ‌ల్ కారు నీ కోసం  ఒకటి సిద్ధం చేయ‌మ‌ని కంపెనీ ఉద్యోగుల‌కు చెప్పాను వ‌చ్చి తీసుకో అంటూ..మ‌రో సందేశం సామాజిక మాధ్య‌మాల ద్వారా పంపారు. ఎక్స్ యూవీ 700 (ఇదీ మ‌హేంద్ర కంపెనీ నుంచి విడుద‌లయ్యే న్యూ మోడ‌ల్ కారు) .. దీనిని నీ కోసం అందిస్తున్నానం టూ ప్ర‌క‌టించారు.



ఈ రోజు నీర‌జ్ చోప్రా ను అంతా ప్ర‌శంసిస్తున్నారు. ఆ ఒక్క యువ‌కుడూ త‌న క‌ల‌ల‌ను నిరూపించుకోవ‌డంలో దేశం ఆస‌క్తుల‌ను అందుకోవడంలో చాలా  చాలా ఉన్న‌తి సాధించాడు అని ప్ర‌శంసిస్తున్నారు.. ఆయ‌న క‌ల‌ల‌కు అండ‌గా నిలిచిన త‌ల్లిదండ్రుల‌ను  మ‌రో మా రు స్మ‌రించండి చాలు..ఇంకేం వ‌ద్దు ఆయ‌న క‌ల‌ల‌కు అండ‌గా నిలిచిన కొన్ని మంచి శ‌క్తుల దీవెన ఉంది. అందుకే ఈ స్వ‌ర్ణం. త‌న‌దైన సాధ‌న‌తో దేశానికో స్ఫూర్తి..త‌న‌దైన సాధ‌న‌తో యువ‌కుల‌కో స్ఫూర్తి అందించ‌డం సులువు కాదు..ఇలాంటి యువ‌కుల కార‌ణంగా దే శంలో నిరాశ‌లు పోతాయి..లేదా నిరాశ‌లు పోయే వ‌ర‌కూ ఇలాంటి విజ‌యాలు సాధ్యం అవుతాయి. ఇలాంటి యువ‌కుల‌ను చూసి పోలీసు ఉన్న‌తాధికారులూ ఇంకా ఇంకొంద‌రూ పొంగిపోతున్నార‌ని మీడియా రాస్తున్న‌ది. అవును! రూల్స్ త‌ప్పే యువ‌కుల‌కూ, రూ ల్స్ ను పాటిస్తూ త‌మ జీవితాల‌ను తీర్చిదిద్దుకునే యువ‌కుల‌కూ ఎంత తేడా.. అందుకేనేమో నిన్న‌టి వేళ భాగ్య న‌గ‌రి పోలీసులు స్వీట్లు పంచుకున్నార‌ని మీడియా చెబుతోంది. వ‌హ్! యువ‌కులూ మీరు క‌ట్టు త‌ప్ప‌ద్దు..అన్న సందేశం ఇందులో ఉంది.. యువ‌కు లూ మీరే ఈ దేశం సాధించాల్సిన క‌ల‌ల‌కు ఆధారం  అన్న సందేశ‌మూ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: