మనం ప్రతిరోజు దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే , శ్రద్ధగా దేవుడిని ప్రార్థించడమే కాదు.. అందుకు తగ్గట్టుగా సువాసన భరితమైన అగరబత్తి పొగతో కూడా దేవుడిని ప్రార్థించాల్సి ఉంటుంది. అప్పుడే దేవుడు మనకు కావలసిన వరాలను ఇస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. సాధారణంగా ప్రతి రోజూ నిద్ర లేవగానే ఇల్లు శుభ్రం చేసి, స్నానం చేసి, పూజగదిలో అగరబత్తులు వెలిగించడం మనందరకు అలవాటు. ముఖ్యంగా ఆధ్యాత్మికత కలిగిన పవిత్ర పరిమలం కోసమే అగరబత్తులు వెలిగించడం జరుగుతుంది. అంతే కాదు ఈ అగరబత్తులు వెదజల్లే సువాసనలు మనసుకు హాయిని కలిగిస్తాయి.

కాకపోతే వీటి నుంచి వెలువడే పొగ సిగరెట్ పొగ కంటే చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పూర్తి వివరాల్లోకి వెళితే 2015 వ సంవత్సరం లో చైనీస్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అగరబత్తులు వెలిగిస్తే , వాటి నుంచి వెలువడే పొగ కారణంగా చిన్న చిన్న పరిమాణంలో అణువులు గాలిలోకి వ్యాపిస్తాయి. కణాలలాగా ఏర్పడి,  మన శరీరంలోకి వెళ్లి హాని కలిగిస్తాయని అధ్యయనం ద్వారా తెలిపారు. ముఖ్యంగా ఈ అగరబత్తులు పొగలో ఉండే 3 రకాల టాక్సిన్లు కొన్ని కొన్ని సందర్భాలలో,  మన శరీరంలో క్యాన్సర్ కు  కూడా దారితీస్తాయట. సైటోటాక్సిక్, జెనోటాక్సిక్, మ్యూటా జెనిక్  అనబడే ఈ మూడు రసాయనాల కారణంగా మన శరీరంలో జన్యుపరమైన మార్పులకు కూడా కారణం అవుతాయి.

ఇక అగరబత్తులు పొగను మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి చేరి, అనారోగ్యాన్ని కలిగిస్తుంది . ముఖ్యంగా ఈ పొగలో ఉండే కణాల్లో 64 సమ్మేళనాలు ద్వారా శరీరంలోకి వెళ్లి, అటు వాయునాలానికి,  ఇటు శరీరానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సహజసిద్ధంగా తయారు చేయబడే అగరబత్తులతో పోలిస్తే , కృత్రిమంగా తయారుచేసే అగరబత్తులు నుంచే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఈ అగరబత్తుల సువాసనకు ఎంత దూరంగా ఉంటే , అంత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచించడం  జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: