
నేరాలు జరగకుండా ఆపాలని పోలీసు శాఖ లేదా నేడు ఇళ్లలో కూడా సీసీ కెమెరాల వాడకం బాగా పెరిగిపోయింది. అయితే ఇవి వచ్చిన తరువాత కూడా విపరీతంగా ఈ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దొంగలు ఒకప్పటి నాటు దొంగతనాలు చేసే వాళ్ళ మాదిరి కాకుండా సాంకేతికతను తగ్గట్టుగా తమను తీర్చిదిద్దుకొని మరీ చోరీలు చేస్తుండటం గమనార్హం. ఇంత తెలివి తేటలు మరోదానిలో వాడితే మంచి ఫలితాలే వస్తాయనేది వాళ్లకూ తెలుసు, కానీ నేడు సమాజంలో త్వరగా అన్ని జరిగిపోవాలనే ఒక హడావుడి జీవనవిధానం వలన ఈజీ మనీ కి బాగా లొంగిపోతున్నారు. దీనితో నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి.
తాజాగా ఒక దొంగల ముఠా ఓ ఇంట్లో భారీగా చోరీ చేశారు. వీళ్లు చోరీకి పాల్పడిన ఇంటిలో 32 సీసీ కెమెరాలు ఉన్నా చాకచక్యంగా తమపని తాము చేసుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో 2 కిలోల బంగారం, 3 లక్షల నగదు చోరీ చేశారు. అయితే ఇంటి యజమాని ఊరికి వెళ్లిన నేపథ్యంలో ఈ దొంగతనం జరిగింది. ఈ ఘటన కూడా ఒక అపార్ట్మెంట్ లో జరిగింది, దానికి ఇద్దరు కాపలాదారు, 32 సీసీ కెమెరాలు రక్షణగా ఉన్నప్పటికీ ఈ దొంగలు విజయవంతంగా దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగలను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు.