ఆగ్రా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది తాజ్ మహల్ మాత్రమే. ఈ పాలరాతి పేమ సమాధిని వెన్నెల రాత్రిలో చూసి తరించడానికి ఎంతోమంది ఎంతగానో పరితపిస్తారు. ఇది ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. మొఘల్ సామ్రాజ్యం గొప్ప నిర్మాణ చతురతకు ఆగ్రా ఒక సాక్ష్యం. ఈ నిర్మాణాలకు కొన్ని ఉదాహరణలు ఆగ్రా కోట, అక్బర్ సమాధి. భారతదేశానికి మొదటిసారిగా వచ్చే ప్రయాణికులకు తాజ్ మహల్ సందర్శన తప్పనిసరి. ఆగ్రాలో ఇదొక ప్రధాన పర్యాటక ప్రదేశం కావడంతో చాలా రద్దీ ఉంటుంది. ఇక్కడే ఉన్న మరో ఐకానిక్ కట్టడం మెహతాబ్ బాగ్ ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు. సూర్యాస్తమయం సమయంలో అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఫతేపూర్ సిక్రి కూడా ఆగ్రాలోని మరొక ఆసక్తికరమైన ప్రదేశం.

ఆగ్రాలోని 5 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు
తాజ్ మహల్
యమునా నది తీరాన ఉన్న తాజ్ మహల్ భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన స్మారక చిహ్నం. ఇది ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. తాజ్ మహల్ అనేది షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన పాలరాతి సమాధి.

మెహతాబ్ బాగ్
తాజ్ మహల్‌కు ఉత్తరాన, ఆగ్రా కోట వైపుగా ఉన్న మెహతాబ్ బాగ్ ఉంటుంది. ఆగ్రాలోని 11 మొఘల్ తోటలలో చివరిది ఇదే. కాంప్లెక్స్ లోపల తోట మధ్యలో నుండి నాలుగు మూలల వరకు విస్తరించిన నాలుగు ఇసుకరాయి టవర్లు, పెద్ద కొలనులు కనిపిస్తాయి. ప్రవేశద్వారం ముందు ఉన్న ఫౌంటెన్ తాజ్ మహల్ దృశ్యాన్ని కనువిందు చేస్తుంది. బాబర్ చక్రవర్తి మెహతాబ్ బాగ్ ను నిర్మించారు.  ఇది మొఘల్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.

ఆగ్రా కోట
ఆగ్రా కోట యమునా నదికి సమీపంలో ఉంది. తాజ్ మహల్ నుండి 2.5 కి.మీ. దూరంలో ఉంది. భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన స్మారక కట్టడాలలో ఇది కూడా ఒకటి. దీనిని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఈ కోట 1573 లో అక్బర్ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది. కాంప్లెక్స్ లోపల,యాత్రికులు పెర్ల్ మసీదు, దివాన్-ఐ-ఖాస్, దివాన్-ఐ-ఆమ్, మోతీ మసీదు, జహంగిరి మహల్‌తో సహా మొఘల్ భవనాలను సందర్శించవచ్చు.

అక్బర్ సమాధి
అక్బర్ సమాధి ఆగ్రా శివారు సికంద్రాలో ఉంది. పూర్తిగా ఇసుకరాయి, తెల్ల పాలరాయితో ప్రధాన సమాధిని తయారు చేశారు. దాని చుట్టూ అందమైన తోట ఉంది. అక్బర్ చక్రవర్తి స్వయంగా ఈ సమాధి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అయితే ఆయన అది పూర్తి కాకుండానే చనిపోవడంతో చక్రవర్తి అక్బర్ తనయుకు సలీం ఆ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అక్బర్ భార్య మరియమ్-ఉజ్-జమాని బేగం సమాధిని ఒక కిలోమీటర్ దూరంలో చూడవచ్చు.

ఫతేపూర్ సిక్రీ
ఫతేపూర్ సిక్రి ఒక చిన్న పట్టణం. ఇది ఆగ్రాకు పశ్చిమాన 40 కి.మీ దూరంలో ఉంది. భారతదేశ సామ్రాజ్యాల చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రయాణికులకు ఇది గొప్ప ప్రదేశం. దీనిని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఫతేపూర్ సిక్రీని 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి స్థాపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: