
పరిస్థితి చుస్తే అది కూడా మంచి పరిష్కారమే, కానీ చూస్తూ చూస్తూ అంత ఖ్యాతి ఉన్న చెట్టును కొట్టేయడం కూడా అంత సులభం కాదు. కానీ అత్యవసర పరిస్థితి కనుక దానిని తొలగించక తప్పడం లేదు. ఇంతకీ ఇది ఎక్కడ ఉందొ చెప్పలేదు కదా. ఇప్పటికే కొందరికి తెలిసిపోయి ఉండొచ్చు, మిగిలిన వారికోసం చెప్పుకుందాం.. ఇది కాలిఫోర్నియా లోని సీక్యోయా అండ్ కింగ్స్ కెన్యాన్ నేషనల్ పార్క్ లో ఉంది. 2200 ఏళ్ళ నాటి చెట్టు అది. గతనెలలో ఇక్కడ తుఫాన్ ప్రభావంతో మెరుపులు పడి పశ్చిమ బాగాన ఉన్న ప్రాంతం అంతా కాలిపోయింది. ఇప్పుడు జనరల్ షేర్వాన్(275 అడుగుల చెట్టు) కు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉండటంతో, దానిని నరికేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఇలాగె గత ఏడాది సంభవించిన అగ్నిప్రమాదంలో అనేక జనరల్ షేర్వాన్ చెట్లు కాలి బూడిద అయిపోయాయి. ఇవన్నీ ఎన్నో వేల ఏళ్ళ నాటి చెట్లే. కానీ ఈసారి పశ్చిమ ప్రాంతంలో అగ్ని రాజుకోవటంతో అదుపు చేయడం కష్టంగా ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. అందుకే అని చెట్లు కాలిపోకుండా అల్యూమినియం ఫాయిల్ ను చుడుతున్నారు. దీనివలన కొన్నైనా ఈ అగ్నిప్రమాదం నుండి రక్షించబడతాయని వారి ఆలోచన. కానీ ఈ పెద్ద చెట్టు మాత్రం అలాంటి ఏర్పాటు చేయడానికి కూడా కుదరని స్థితిలో ఉండటంతో తొలగిస్తున్నారు. ఇంకా ఈ పార్కులో 2000 చెట్లు ఉన్నాయి. ఈ పార్కుకు మంటలు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉండటంతో అధికారులు తగిన జాగర్తలు తీసుకుంటున్నారు.