
ఇలాంటి పండుగ వేళల్లో మన సికింద్రాబాద్ చర్చ్ ఎలా ఉంటుందో.. మా ఊరి బాప్తిస్టు చర్చి ఎలా ఉందో.. ఇవన్నీ తలుచుకుని పోతున్నాను. ఎదురుగా ఓ కథ.. సహజనటి జయ సుధ చెప్పారీ కథ. నేను సాయం చేయాలనుకున్నా చాలని స్థితి.. చాలీ చాల ని స్థితి వారిది.. అంటూ చెప్పిన కథ..
క్రిస్మస్ వేళలు..చర్చికిపోయారు ఆమె.. అప్పుడే తనకు అనుకున్న సాయం వేరు.. తరువాత అనుకున్న సాయం వేరు.. సాయం అంకెల్లో లేదు. చేసే హృదయంలో ఉంది. విస్తారమయిన గుణంలో ఉంది అని నిరూపించారు జయసుధ.. ఓ క్యాన్సర్ బాధితుడు ఆ బాలుడు.. పేరు అరుళ్.. ఏటా తన వంతు సాయం చర్చిలో ప్రకటించారు ఆమె.. నేను ఐదు వేలు ఇస్తాను ఎవరికి కావాలి అ ని..కానీ ఎవ్వరో మేడమ్ మీరు చేయాలనుకుంటే ఓ కుటుంబానికి చేయండి అని అరుళ్ కథ చెప్పారు.. వెళ్లి చూస్తే ఆ కుటుంబాని కి దక్కాల్సిన సాయం అది కాదు..చేతిలో డబ్బులే లేవు.. వీలున్నంత వరకూ డబ్బులు పోగేసే పని చేసి ఆ కుటుంబాన్ని ఆదుకో వడం బాధ్యతగా మారింది ఆమెకు.. ఎవ్వరెవ్వరో గుర్తుకు వస్తే చేసే పని ఎలా అయినా నిర్విరామంగా పూర్తి అవుతుందని.. గుర్తు కు వచ్చే పేర్లు తప్పక తన హృదయాన్ని అర్థం చేసుకోవాలి.. నేను చేస్తాను మీరు చేయండి అని చెప్పడంలో గొప్ప ఔదార్యం ఉంది.. ఆమె ఇదే నేర్పారు తన కథతో! అరుళ్ వైద్యానికి నాలుగు లక్షలు కావాలి.. ఏం చేయగలను నేను అని అనుకుంటూ ఉంటే గుర్తుకు వచ్చిన పేర్లు ... ప్రకాశ్ రాజ్, అర్జున్, రాధిక, సుహాసిని, విజయశాంతి, లత వాళ్ల తమ్ముడు రాజ్ కుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్ ... ఇన్ని పేర్లు పేరు పేరునా కృతజ్ఞతలు చెల్లించి చేశారామె సాయం.. ఆ రోజు క్రిస్మస్.. చేయాలనకున్న సాయం కు దేవుడు తోడయ్యాడు విజయం అందించి నిండు మనసుతో దీవించాడు అని చెప్పారామె.. ఇప్పుడు అరుళ్ ఎక్కడున్నాడు?