తాజాగా ఒమిక్రాన్ అనే సరికొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మళ్లీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం మొదలుపెట్టారు. ఇకపోతే బయటకు వెళ్లే ముందు మాస్క్ లు ధరించడం ఎంత ముఖ్యమో తిరిగి వచ్చిన తర్వాత దానిని శుభ్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యమని అందరూ గమనించాలి.. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మాస్కు ధరించి బయటకు వెళ్తాము.. అప్పుడు పర్యావరణంలో ఉండే బ్యాక్టీరియా ,వైరస్, క్రిములు చేరుతాయి. ఇక ఈ మాస్క్ శుభ్రం చేసుకోకుండా అలాగే వేసుకోవడం వల్ల శ్వాస తీసుకున్నప్పుడు.. మాస్క్ పై ఉన్న వైరస్ లు మన శరీరంలోకి చేరి మనకు కొత్త సమస్యలు తలెత్తుతాయి.
మీరు ప్రతిరోజు క్లాత్ మాస్క్ గనుక ఉపయోగిస్తున్నట్లు అయితే తప్పకుండా ప్రతిరోజు రాత్రి శుభ్రం చేసి ఉదయాన్నే డ్రై అయిన తర్వాత మాత్రమే ఆ మాస్క్ ను ఉపయోగించాలి. ప్రతి రోజు శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఇక మీ చుట్టుపక్కల జనాలు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఇంటి నుంచి బయటకు వెళితే తప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేవరకు మాస్కు ధరించే ఉండాలి. మాస్క్ తొలగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ రిమూవ్ చేసేటప్పుడు కేవలం రెండు వైపులా వుండే వైర్ ను మాత్రమే పట్టుకుని రిమూవ్ చేయాలి.కాబట్టి క్లాత్ మాస్క్ అయితే ఉపయోగించిన ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి. డిస్పోసల్ అయితే డస్ట్ బిన్ లో వేయాలి.