1. గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక బరువు తగ్గాలని అనుకొనే వాళ్ళు ప్రతి రోజు కూడా తమ డైటింగ్ లో భాగంగా గ్రీన్ టీ ని తీసుకోవాలి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇందులో ఉండే కెఫిన్ క్యాలరీలను కరిగిస్తుంది. ఇక అదే విధంగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి వీలవుతుంది.
2. పుదీనా టీ:
మంచి ఫ్లేవర్ ఉండే ఈ పుదీనా లతో టీ చేసుకొని తాగడం వల్ల మంచి అరోమా అందడమే కాకుండా బరువు కూడా తగ్గవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు శరీరంలో ఉండే కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గవచ్చు.
3. వైట్ టీ:
దీన్ని తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది . అందుకే చాలామంది బరువు తగ్గాలని ఆలోచించేవాళ్లు వైట్ టీ ను ప్రిఫర్ చేస్తారు. ఇందులో మైక్రో న్యూట్రియెంట్స్ ఉండడం వల్ల కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఇకపోతే ఆరోగ్యం ఫిట్ గా ఉండా లి అంటే వైట్ టీ తాగాల్సిందే.
ఇక వీటితో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.