1).పండుగ ఏదైనా సరే ఖచ్చితంగా మాస్కులు ధరించడం మర్చిపోకండి.. ఇతర ప్రాంతాల నుంచి మన బంధువుల తో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా వీటిని ధరించాలి. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
2). సంక్రాంతి పండుగ అంటే ఎక్కువగా రుచికరమైన పిండి పదార్థాలు, పానీయాలు బాగా గుర్తుకు వస్తాయి. అయితే కరోనా కారణంచేత.. రుచితోపాటు గా ఆరోగ్యానికి ప్రయోజనం కలిగే ఆహారపదార్థాల కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని ఎంత దూరం పెడితే అంత మంచిది.
3). ఇంటిని అలంకరణ చేసేటప్పుడు తక్కువ స్థలంలోనే మీ ఇంటిని అందంగా తీర్చిదిద్ది కోండి.
4). ముఖ్యంగా కొత్త దుస్తులు కొనేందుకు కోసం ఎక్కువగా బయట తిరగకండి. ఇంట్లో ఉన్న కొత్త వస్తువులతోనే కాస్త అడ్జస్ట్ అయ్యేలా ఉండండి.
5). ముఖ్యంగా మన బంధువులు రాలేదని బాధపడకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం.. వాట్సాప్ నుంచి వీడియో కాల్, జూమ్ కాల్ ద్వారా మన బంధువులను వీడియో రూపంలో చూసుకొని ఎంజాయ్ చేయండి.
6). ముఖ్యంగా ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్న వారితో సరదాగా డాన్సులు వేస్తూ, కబుర్లు చెబుతూ వారితో కలిసి ఆనందించండి. ఇలా ప్రతి ఒక్కరూ తమ పండుగను జరుపుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు.