చాలామంది ఇంటి తలుపులు కిటికీలు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటారు.. దీని వల్ల తాజా గాలి లోపలికి ప్రవేశించదు.. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే తలుపులు, కిటికీలు తెరిచి ఉండాలి.. ఒక నిద్రపోయే సమయంలో మాత్రమే ఇంటికి తలుపులు, కిటికీలు బంధించడం తప్పనిసరి.. ఆ తర్వాత మంచం మీద ఉండే దుప్పట్లు , దిండు లు వంటి వాటిని దుమ్ముదులిపి సరి చేస్తూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఇల్లు ప్రశాంతంగా మారి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
దీపారాధన సమయంలో మంచి సువాసన వచ్చే అగర్బత్తి లను ఇంట్లో వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.. పరిమళ భరితమైన సువాసనలు ఇంట్లోకి ప్రవేశించడం వలన ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి మంచి సువాసన వచ్చే అగరబత్తీలు పూజామందిరంలో వెలిగించండి.
కనీసం వారానికి మూడుసార్లు సాంబ్రాణి పొగ వేయడం చాలా మంచిది.. ఇంట్లో ఉండే క్రిమికీటకాలు బయటకి వెళ్లి పోవడమే కాకుండా దోమలు వంటివి కూడా దరిచేరవు.. పైగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.
కాబట్టి ఇలాంటివి పాటించడం వల్ల మన ఇంట్లో ప్రశాంతత నెలకొని దరిద్రం అంతా బయటకు పోతుంది.