తమిళనాడు సీఎం స్టాలిన్ రూటే సెపరేటు.. సీఎం అయ్యే వరకే రాజకీయాలు అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నాడు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలను ఇతర రాష్ట్రాల వారు కూడా మెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేటంటే.. తమిళనాడులోని మధురైలో "కళైజ్ఞర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీని నిర్మించబోతున్నారు. సుమారు మూడు ఎకరాల్లో ఈ గ్రంథాలయాన్ని నిర్మించనున్నారు.


మొత్తం 2 లక్షలకు పైగా  చదరపు అడుగుల్లో ఈ విజ్ఞాన క్షేత్రం తయారు కాబోతోంది. ఈ అద్భుతమైన గ్రంధాలయానికి ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో 8 అంతస్థుల్లో ఈ గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొలువు దీరబోతున్న ఈ గ్రంథాలయాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఈ లైబ్రరీలోని అధునాతనమైన సౌకర్యాలు చూస్తే షాక్ అవ్వాల్సింది. 8 ఫ్లోర్స్ , వీలైనన్ని ఎలివేటర్లు.. ప్రశాంతమైన రీడింగ్ ఏరియాలు ఇక్కడ ఉంటాయట. గ్రూప్ రీడింగ్ ఏరియా, విశాలమైన పచ్చికలు, వాష్ రూమ్స్, రెస్టింగ్ ప్లేసెస్.. ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పగటి పూట పూర్తి సహజమైన వెలుతురుతోనే చదువుకునేలా ఏర్పాట్లు ఉంటాయట. పూర్తి ఎయిర్ కండిషనింగ్ తో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గ్రంధాలయంగా దీన్ని నిర్మించబోతున్నారు.


ఈ గ్రంథాలయంలో అన్ని రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలు కొలువుదీరబోతున్నాయి. పుస్తకాలతో పాటు సాఫ్ట్ కాపీలు, జిరాక్సులు, ఆన్లైన్ మ్యాగజైన్లు, వివిధ రకాల సాంకేతిక పరికరాల ద్వారా డిజిటల్ రీడింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంటే ఇది ఒక విధంగా స్వర్గధామం అంటే ఇదేనేమో.. బధిరుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆడియో హాళ్లు ఉంటాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఇక్కడ ఉంటారు. విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, యువత,  కళాకారులు, పోటీపరీక్షలకు సిద్దమవుతున్నారు.. ఇలా అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా ఈ కళైజ్ఞర్ మెమోరియల్ లైబ్రరీని తీర్చిదిద్దుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: