శీతల వాతావరణం లో చాకోలెట్లు పాడవ్వకుండా ఉంటాయి అన్నది అందరికి తెలిసిందే. కానీ ఓ ప్రముఖ కంపెనీ చాకోలెట్లు మాత్రం సుమారు 103 సంవత్సరాలు నాటి నుంచి ఇప్పటికి చాలా బాగా ఉండటం ఎప్పుడైనా విన్నారా ? అయితే అలాంటి వాటి గురించి తెలుసుకోవాలంటే కింద చదవండి.



 ప్రపంచవ్యాప్తంగా క్యాడబరీ చాకోలెట్లు గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ కంపెనీ నుండి వచ్చిన పలు రకాల బ్రాండెడ్ చాకోలెట్లు మార్కెట్ లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద వారి నుండి చిన్న పిల్లల వరకు ఈవే అంటే ఏంతో ఇష్టపడతారు. అటువంటి ఈ సంస్థ చాకోలెట్లను మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటి వరకు భద్రపరుస్తున్నారు. 



మొదటి ప్రపంచ యుద్ధం లో బ్రిటిష్ సైన్యం లో పనిచేసిన సైనికుడు రిచర్డ్ బులిమోర్ ఒకరు. అతనికి చెందినవే ఈ క్యాడబరీ చాకోలెట్లు. ఇవి ఇప్పటికి ఇలా మిగిలిపోవడానికి ముఖ్య కారణం బులిమోర్ కు చాకోలెట్లు అంటే ఇష్టం లేకపోవడమే. ప్రపంచ యుద్ధం చేసే సమయంలో క్రిస్మస్ పండగ రావడంతో ఫ్రాన్స్ లోని బ్రిటిష్ సైనిక దళాలకు  నాటింగ్ హోంషైర్ లోని మ్యాన్స్ ఫీల్డ్ లో తయారు చేసిన క్యాడబరీ చాకోలెట్ల  బార్ టిన్నులను బహుమతిగా ఇచ్చారు. 



బులిమోర్ కు ఇచ్చిన టిన్నులో మొత్తం పది చాకోలెట్లు బార్లు ఉన్నాయి. కానీ ఆయన బలవంతంగా ఒక చాకోలెటు మాత్రమే తినగలిగాడు. మిగిలినవి భద్రంగా ఆ టిన్నులోనే ఉంచారు. తర్వాత కాలంలో వాటి గురించి అతను పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పటికి అవి రుచిని గాని, రూపురేఖలు ఏమాత్రం మరకపోవడం విశేషం. 



బులిమోర్  చాకోలెట్లు మాత్రమే కాకుండా సిగరెట్లును సైతం ఎక్కువగా తాగే వాడు కాదు ప్రిన్సెస్ మేరీ సైనికులకు ఇచ్చిన సిగరెట్ గిఫ్ట్ బాక్స్ లో సైతం కేవలం 3 సిగరెట్లు మాత్రమే వాడుకున్నాడు. మిగతావి  ఆ బాక్స్ లోనే ఉండిపోయాయి. 



ఇవన్నీ ఎలా బయట ప్రపంచానికి తెలిశాయి అంటే మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న వారికి సంబంధించిన వస్తువులు వేలం వేసిన సమయంలో వీటి గురించి వార్తల్లో వచ్చాయి. ఆ వేలంలో బులిమోర్ చాకోలెట్ల టిన్నుకు, సిగరెట్ బాక్స్  భారీగానే ధర పలికాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: