1). మన వంటింట్లో దొరికే మిరియాలు, బాదం పప్పును బాగా కలిపి పొడిగా చేసి ఆ మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇక తొందరగా తగ్గాలి అంటే మిరియాల పొడిలో కాస్త నెయ్యి కలిపి తాగినట్లయితే విముక్తి కలుగుతుంది.
2). గొంతు నొప్పి వచ్చినప్పుడు ఎంతో ఇన్ఫెక్షన్ కూడా కలుగుతుంది. గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలగాలంటే కషాయాలు తయారు చేసుకొని తాగడం మంచిదట.
3). ఒక చిన్న క్లాసులు నీటిని తీసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగినట్లు అయితే నోటిలో కోసుకొని ఉమ్మి వేయడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
4). ఇక గొంతులో ఇన్ఫెక్షన్ నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే.. కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం ముక్కలను వేసి వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా ఇందులో కి కాస్త తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
5). ఇక అంతే కాకుండా దగ్గు ఆకును వారంలో ఒకసారి అయినా తినడం వల్ల తరచు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే సమస్య నుండి కాపాడుతుంది.