1). కింద పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే వెన్నునొప్పి ఉండేవారు భూమి ఉపరితలం పైన మాత్రమే నిద్రించాలి. చదునైన ప్రదేశంలో పడుకోవడం ద్వారా నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు. అయితే కొంతమంది చాప మీద కూడా పడుకుంటూ ఉంటారు. అలా పడుకొని మీరు పరుపు మీద పడుకోవాలి అనుకుంటే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుచేతనే బొంతలు వాడటం చాలా మంచిది.
2). నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ చాలా సక్రమంగా పనిచేస్తుంది. అయితే అడ్డదిడ్డంగా పడుకోవడం వల్ల వెన్నునొప్పి సమస్య తీవ్రమవుతోంది కాబట్టి వెన్నుముక నిటారుగా ఉంచి నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు ఏమి ఉండవు.
3). అయితే వృద్ధులు నేల మీద మాత్రం పడుకోకూడదు. ఎందుకంటే వారికి నడకలో సమస్య.. ఎముకలకు సంబంధించిన సమస్యలు.. అలర్జీ వంటివి వస్తాయి. ఇక అంతే కాకుండా లేచి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే వాళ్ళు నేల మీద నిద్ర పోకపోవడమే మంచిది.
4). అయితే నేలమీద పడుకోవాలి అనుకొనేవారు ముందుగా నేల ను శుభ్రంగా చేసి పడుకునే చోట మురికిగా లేకుండా నేలమీద చాప వేసుకొని నిద్రించడం మంచిది.