వేసవి కాలంలో ప్రజలు ఈ వేడి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను, కొన్ని పానీయాలను తీసుకుంటూ ఉంటారు .ఇది మన శరీరం లోపల చల్లగా ఉంచుతాయి అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక కొంత సమయం వరకు ఉపశమనం కలిగిస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయట. ఇక వీటిని ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలు కలగకుండా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుచేతనే కూల్డ్రింక్స్ చాలా తక్కువగా తాగమని నిపుణులు తెలియజేస్తున్నారు.
1). ఐస్ టీ ఎక్కువగా తాగితే స్ట్రోక్ లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వారి తెలిపిన అభిప్రాయం ప్రకారం ఐస్ టీ అనేది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది. అదనంగా ఇది మన శరీరంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. అందుచేతనే దీనిని దూరంగా ఉండడం మంచిది.
2). నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఐస్ టీ తీసుకోకపోవడం మంచిది. ఇందులో ఉండే కెఫిన్ పదార్థం వల్ల నిద్ర వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది.
3).ఐస్ టీ ఎక్కువగా తాగితే కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా దీని వల్ల కాలేయ వైఫల్యానికి కూడా దారి తీస్తుందట. ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఐస్ టీ మానేయడం మంచిది.
4).ఐస్ టీ వల్ల బరువు పెరుగుతారని.. కొవ్వు సమస్య ఉన్నవారు వీటిని తాగకూడదని నిపుణుల అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. కొంతమందిలో ఐస్ టీ ఇలా ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. కానీ ఇది మన శరీరంలో ఉండే కొవ్వు ని పెంచుతూ ఉండడం వల్ల విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.