సాధారణంగా ప్రతి ఇంటి వంట ఇంటికి మహిళ అంకితం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే కనీసం రోజుకు ఒకసారైనా సరే వంటింటి లోకి అడుగుపెట్టాల్సిందే. ఇక వంటింటికి.. ఆ ఇంటి ఇల్లాలికి అంత అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక ప్రతి ఒక్క మహిళ కూడా తమ వంట ఇంటిని తమ కంటే బాగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వంట గదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకపోతే వంటగదిలోకి ఎన్నో బ్యాక్టీరియాలు చేరి రోగాలు కూడా వస్తాయి. అందుకే వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.

ఇకపోతే వంటింట్లో ఎప్పటికప్పుడు వంట దినుసులను తాజాగా ఉండేటట్టు చూసుకోవాలి . లేకపోతే వాటి లో పురుగు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో మీరు పప్పు దినుసులను భద్రపరిచే టప్పుడు వాటిలో ఒట్టి మిరపకాయలు లేదా వేప ఆకులను వేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల తాజాగా ఉండడమే కాదు పైగా అవి ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. ఇక వంట గదిలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది . అలాంటప్పుడు బొద్దింకలను దూరం చేయాలి అంటే ఎప్పటికప్పుడు వంటగదిని శుభ్రం చేస్తూ సింక్ ను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి.


ముఖ్యంగా మీరు ఉపయోగించే సింక్ తళ తళ మెరవాలి అంటే ముందుగా సింక్ ను ఏదైనా పేపర్ తో శుభ్రం చేసి ఆ తర్వాత కాటన్ క్లాత్ తో మాత్రమే శుభ్రం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్క్రబ్ తో సింక్ ను  శుభ్రం చేయకూడదు. అలా చేస్తే సింక్ పై గీతలు పడే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి తిన్న పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరిగిపోయి మరింత అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వంటింటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: