ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు కూడా ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకుందాం.
ఎవరైనా సరే మలబద్దకం, గ్యాస్ , అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు భోజనం తిన్న తర్వాత అపానవాయువును తొలగించడం కోసం సోంపు గింజలు తప్పకుండా తినాలి. ఇక సోంపు గింజలు తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాదు అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
జీలకర్ర కూడా అన్న వాహికలో ఏర్పడే అడ్డంకులను తొలగించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అన్నవాహిక పైపు క్లియర్ చేయడంలో సహాయపడే జీలకర్ర , గ్యాస్ సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగలో జీలకర్ర కలుపుకుని తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య త్వరగా తొలగిపోతుంది.
ఇక యాలకులు కూడా కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. యాలకులు రోజుకొకటి నోట్లో వేసుకోవడం వల్ల గ్యాస్ సమస్య తగ్గడమే కాదు తిమ్మిరి , వికారం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ సమస్యను తొలగించి పొట్టని శుభ్రం చేయడంలో యాలకులు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి.