భార్య భర్తల మధ్య వైవాహిక జీవితంలో ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలి అంటే వారి మధ్య శారీరక సంబంధం కూడా ఎంతో ముఖ్యమని చెబుతుంటారు నిపుణులు. ఇక శారీరక సంబంధం ఎంత బలంగా.. సౌకర్యవంతంగా  ఉంటుందో ఇక వారి దాంపత్య బంధం కూడా అంత కలిసి మెలిసి ఉండేందుకు అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో మాత్రం భార్యాభర్తల మధ్య ఇక అటు శారీరక సంబంధం ఎక్కువగా ఉండటం లేదు అన్నది ఎన్నో సర్వేలు చెబుతున్న మాట. పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఒకే రూమ్ లో ఉంటున్నప్పటికీ అటు ఒత్తిడి కారణంగా ఎక్కువగా శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి భార్యాభర్తలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.



 ఇక ఇలాంటి కారణాల వల్ల ఎంతో మంది భార్యాభర్తలు మనస్పర్థలు వచ్చి విడిపోతున్న పరిస్థితులు కూడా వస్తున్నాయని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే భార్య భర్తల బంధం గురించి కి సంబంధించి కొన్ని సర్వేలు నిర్వహించగా షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక సర్వేకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఇటీవలికాలంలో శారీరక సంబంధం ఎలా ఉంటుంది అన్న విషయం పై సర్వే నిర్వహించగా షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.


 భర్తతో సెక్స్ లో పాల్గొనడానికి తాము నో చెప్పలేము అంటూ 18 శాతం మంది భార్యలు అభిప్రాయం వ్యక్తం చేశారట. అదే సమయంలో ఒక వేళ భార్య తమతో సెక్స్ కీ నిరాకరించిన సమయంలో 20 శాతం మంది భర్తలకు కోపం వస్తుందని ఈ సర్వేలో భాగంగా చెప్పారట. ఇక మరో 13 శాతం మంది భర్తలు ఒకవేళ భార్యలు సెక్స్ కీ నో చెబితే ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నారట లేదా బలవంతంగా భార్యతో శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా సెక్స్ కి నో చెప్పే భార్యలలో ఎక్కువగా చదువుకున్న వారే ఉన్నారట. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 5 సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: