ఇక గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే విటమిన్ డి చాలా అవసరం.. రక్తప్రసరణ మెరుగుపడాలన్నా కూడా విటమిన్ డి తప్పనిసరి కండరాలు దృఢంగా మారాలన్నా.. నిద్ర సరిగా పట్టాలన్నా, బరువుని నియంత్రణ లో ఉండాలన్నా కూడా విటమిన్ డి తప్పనిసరి. ఇకపోతే కొంతమంది డిప్రెషన్ కు గురి అవుతూ ఉంటారు.. అలాంటి వారిలో విటమిన్ లోపించిందని గుర్తించాలి. విటమిన్ డి లోపం కారణంగా సంయమనం అసలు ఉండదు. డిప్రెషన్ ఏర్పడి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ డి మనకు ఎలా దొరుకుతుంది అంటే వంటింట్లో లభించే పాలు, గుడ్లు, చేపల గుడ్లు, చేపలు, మష్రూమ్స్ వంటి వాటి వల్ల విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది.
ఇకపోతే వీటిని ప్రతిరోజు తినలేము అనుకునేవారు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో సూర్య రశ్మికి బయట అటు ఇటు నడవడం వల్ల విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. ఇక విటమిన్ డి లోపం ఏర్పడకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఇలాంటి ఆహారాలను మీ డైలీ వారి భోజనంలో తీసుకోవడం మంచిది.