ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిక్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ బారిన పడకుండా ఉండడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ముందుగానే సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషధంగా చెప్పబడిన నేరేడు చెట్టు యొక్క ఆకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక నేరేడు ఆకులు డయాబెటిస్ కి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో నేరేడు ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి తరచూ ఈ ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం తప్పనిసరి. ఇక మలబద్ధకం,  అలర్జీ వంటి సమస్యలను నివారించడంలో నేరేడు ఆకులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా నేరేడు ఆకులలో ఉండే యాంటీ  వైరల్,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఇక దంతాలు,  చిగుళ్ల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు నేరేడు ఆకుల రసాన్ని నోట్లోకి వేసుకొని పుక్కిలిస్తూ ఉండడం వల్ల దంత సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇక అరికాళ్ళు, చేతులు మంటలు వస్తూ ఉంటే నేరేడు ఆకుల రసంలో తేనె కలిపి తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.  ఈ ఆకుల నుండి తీసిన నూనెను సుగంధ ద్రవ్యాలు , సబ్బులు,  పర్ఫ్యూమ్స్ లాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ఔషధం అని చెప్పవచ్చు. నేరేడు ఆకులను శుభ్రంగా కడిగి , నాలుగు నల్ల మిరియాలు కలిపి పేస్ట్ చేయాలి.దీనిని నీటిలో వేసుకొని జ్యూస్ లాగా ప్రతిరోజు తాగుతూ ఉంటే ఫలితం లభిస్తుంది. ఇక మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం వస్తూ ఉంటే నేరేడు ఆకులను ఔషధంగా తీసుకోవచ్చు. ఇక శరీరంలో వచ్చే క్యాన్సర్ కన్నితులు పెరగకుండా అభివృద్ధి చెందకుండా నేరేడు ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: