ఈ టి అనేది మెదడుని శరీరాన్ని యాక్టీవ్ స్టేజ్ లోకి తీసుకెళ్తుంది. కానీ అతి ఏదైనా అనర్తం అన్నట్టు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే పరగడుపున టీ తీసుకోవడం వల్ల ఆకలి వేయదు. అందువల్ల టిఫిన్ తినడం మానేస్తుంటారు.మన శరీరానికి అత్యంత శక్తి కలిగించేది అల్పాహారమే.కానీ క పరగడుపునే వేడి వేడి టీ త్రాగటం వల్ల వలన పొట్టలో ఆమ్లతత్త్వం,పెరిగి జీర్ణశయం పనితీరును తగ్గిస్తుంది.దాంతో ఆకలి సరిగా వేయక గ్యాస్ ఫార్మ్ అయి గుండెల్లో మంట లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.అలాగే తలనొప్పిని తగ్గించేందుకు కొంతమంది టీ, కాఫీ పడితే కానీ తగ్గదు అని తీసుకుంటూ ఉంటారు.
ఇది నొప్పి నివారించినప్పటికి ఎక్కువగా తీసుకోవడం వలన నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.. టి తీసుకోవడం వలన స్ట్రెస్ తగ్గడం వంటివి జరిగిన, ఇతర జీర్ణసంబంధిత అనారోగ్యలను కలగచేస్తుంది. అలాగే పరగడుపున టీ తీసుకోవడం మూలన నోటి దుర్వాసన వస్తుంది.నోటి ఆరోగ్యం కూడా పాడవుతుంది. నిద్ర సమస్యతో పాటు… ఇక ఉదయం పూట టీ తీసుకోవడం వలన శరీరంలో నీటి శాతం తగ్గి, మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.పొట్టలో జీర్ణద్రవాల ఆమ్లతత్వాన్ని కాఫీలో వున్న కేపిన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది.ఇది గ్యాస్ ఫార్మ్ చేయడం వల్ల గుండెసంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.