చాలామంది 40 సంవత్సరాలు దాటుతూనే వృద్ధాప్య చాయలు కనిపిస్తాయి. చర్మం ముడుతలు రాగానే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వృద్ధాప్యలు రాకుండా ఆహార అలవాట్లు, జీవన విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1).చిరుధాన్యాలు..
చిరుధాన్యాలు శరీరానికి కావాల్సిన  పోషకాలను అందిస్తాయి. మన రోజు వారి ఆహారంలో చిరు దాన్యాలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల వృద్ధాప్య చాలు అంత తొందరగా కనబడవు. చర్మం అందంగా, ముడతలు లేకుండా తయారవుతుంది.

2). మొలకెత్తిన గింజలు..
అందువల్ల రోజూ ఉదయాన్నే  పెసలు, అలసందలు ఇలా రకరకాల విత్తనాలతో తయారుచేసిన మొలకెత్తిన గింజలను లేక తృణధాన్యాలతో తయారు చేసి వంటలను గాని తినడం వల్ల, ఇందులో ఉన్న ఫైబర్ తక్కువ తిన్న ఎక్కువ తిన్న ఫీలింగ్ కలిగించి  అధిక బరువు పెరగకుండా చేస్తుంది.

3). రాజ్మా..

రాజ్మా రోజూ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే వీటిలో పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయి.శరీరానికి కావాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ఎనిమిది వరకు వీటిలోనే లభిస్తాయి. ఇవి శరీరం యొక్క ముడతలను తగ్గించి, వృద్ధాప్యఛాయాలను రాకుండా సహాయపడతాయి.

4).బీన్స్..
బీన్స్ తీసుకోవడం వల్ల షుగర్ తో పాటు గుండె సంబంధింత రోగాలు బారినపడకుండా కాపాడుతాయి.ఇందులో ఉండే గ్లైసెమికల్ ఇండెక్స్ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా సహాయంచేస్తాయి.

5). పండ్లు..
పండ్లలో ఉండే ప్రోటీన్లు చర్మంమరియు జుట్టు అందంగా తయారవడానికి సహాయపడతాయి. ఇందులో ఫోల్టేట్, మెగ్నీషియం, థియామిన్ ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతంచేస్తాయి.

6).కూరగాయలు..
 కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల  శక్తి స్థాయిలను పెంచుతాయి. జుట్టు తక్కువ వయస్సులో తెల్లపడకుండా కెరోటిన్ ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతాయి.ముఖ్యంగా బీన్స్ శరీరానికి కావాల్సినంత కాల్షియం, పొటాషియం అందించగలవు.
 వీటన్నిటితో పాటు తగినంత  వ్యాయామం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: