ఈ చలికాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరము,దగ్గు,జలుబు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ కి గురవుతూ ఉంటారు. వీటిని తగ్గించడానికి ప్రతి ఒక్కరికి రోగనిరోధకశక్తి చాలా అవసరం. ఆ రోగనిరోధకశక్తిని పెంచే గుణము అల్లము మరియు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.వీటితో తయారు చేసే బర్ఫీ ల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకొని సీజనల్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. వాటి వల్ల ఉపయోగాలు ఏంటో అవి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం..

1).అల్లంబర్ఫీ..
అల్లంబర్ఫీ కోసం ముందుగా ఒక పావు కేజీ అల్లం తీసుకొని శుభ్రంగా కడగి, తేమంతా పోయేవరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఓ గిన్నెలో రెండు కప్పుల బెల్లం వేసి, ఒక అర కప్పు నీరు వేయాలి. ఇది బాగా మరిగిన తర్వాత అల్లం పేస్ట్ ని ఇందులో వేసి బాగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం గట్టిపడిన తర్వాత దింపేసి చల్లారనివ్వాలి. దీనిని చలికాలంలో  ప్రతి ఒక్కరూ ఒక చిన్న క్యాండీ లాగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే, ఇందులో ఉన్న పోషకాలు మన అలర్జీలను తగ్గిస్తాయి.అల్లం వల్ల అజీర్తి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు.

2). ఉసిరి బర్ఫీ..
ఉసిరి విటమిన్ సి కి పుట్టినిల్లు అని చెప్పవచ్చు. దీనిని చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండి,రోగనిరోధకశక్తిని పెంచుతుంది. డైరెక్ట్ గా తినలేనివారు ఇలా బర్ఫీలు తయారు చేసుకుని తినొచ్చు. అందుకోసం రెండు కప్పుల బెల్లం తీసుకొని, అందులో ఐదు లేక ఆరు ఉసిరికాయల మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి.అది బాగా పట్టిన తర్వాత,ఉండలా తయారయ్యేటప్పుడు, స్టవ్ మీద నుంచి దింపి వేయాలి. బాగా చల్లారిన తర్వాత బర్ఫీ  తయారవుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: